Saturday, April 27, 2024

నాటో దేశాలపై దాడి చేయం..ఎఫ్ 16లను మాత్రం కూల్చివేస్తాం : పుతిన్

- Advertisement -
- Advertisement -

నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వాదనను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు.కానీ, ఉక్రెయిన్ కు పశ్చిమదేశాలు ఎఫ్16 యుద్ధ విమానాలను అందజేస్తే మాత్రం వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. బుధవారం టోర్జోక్ ప్రాంతంలో ఉన్న రష్యా వైమానిక స్థావరాన్ని ఆయన సందర్శించారు. అక్కడి పైలట్లతో ముచ్చటించిన ఆయన కొద్దిసేపు సైనిక హెలికాప్టర్ లోని సిమ్యులేటర్ లో కూర్చుని దాన్ని పరిశీలించారు. దాదాపు రెండేళ్ల నుంచి రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం చేస్తోంది.

మాస్కోతో పోరాటంలో ఎఫ్ 16ల అవసరం ఉందని కీవ్ చెబుతోంది. పొరుగున ఉన్న బెల్జియం, డెన్మార్క్, నార్వే, నెదర్లాండ్స్ దేశాలు వాటిని తమకు అందజేయాలని కోరింది. ఎఫ్ 16లను ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు అమెరికా అంగీకరించడంతో నెదర్లాండ్స్, డెన్మార్క్‌లు ముందుకొచ్చాయి. త్వరలో ఉక్రెయిన్ పైలట్లు శిక్షణ తీసుకోనున్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి దిమితో కేలేబా తెలిపారు. ఈ నేపథ్యం లోనే పుతిన్ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News