Sunday, April 28, 2024

డొనాల్డ్ ట్రంప్ దంపతులకు కరోనా

- Advertisement -
- Advertisement -

Donald Trump and Melania test positive for Covid

వాషింగ్టన్: కరోనా మహమ్మారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను సైతం వదలలేదు. తాజాగా డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా ట్రంప్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ట్రంప్ దంపతులు క్వారంటైన్ లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ”ఈ రోజు రాత్రి మెలానియాతో పాటు నాకు కరోనా నిర్ధారణ అయింది. మేమిద్దరం క్వారంటైన్‌లో ఉండనున్నాం… కరోనా నుంచి కోలుకునేందుకు చికిత్స తీసుకుంటాం”అని ట్రంప్ ట్వీట్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, ట్రంప్ ప్రధాన సలహాదారు హోప్ హిక్స్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కుటుంబసభ్యులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అగ్రరాజ్యంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న విషయం విదితమే.

https://twitter.com/realDonaldTrump/status/1311892190680014849

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News