Sunday, April 28, 2024

ఓడినా డోంట్‌కేర్.. ట్రంప్ తాజా తిరకాసు

- Advertisement -
- Advertisement -

Donald Trump Prepared to accept election defeat

 మద్దతుదార్లకు వైట్‌హౌస్ విందు

వాషింగ్టన్: ఫలితం నిర్థిష్టం అయితే తాను ఓటమిని అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను కోర్టులలో సవాలు చేయడం, పైగా ఫలితాన్ని అంగీకరించేది లేదని చెపుతూ వస్తున్న ట్రంప్ వైఖరి అధికార మార్పిడికి కొరకరాని కొయ్య అయింది. ఈసారి ఎన్నికలలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని, ఇది పెద్ద స్థాయిలో జరిగిన ఓటర్ ఫ్రాడ్ అనే విషయాన్ని తాను మరోసారి తెలియచేస్తున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరిగినప్పుడు గెలుపోటములపై స్పష్టత ఉండాలి. తను ఓడానని చెప్పడం జరిగితే ఈ విషయంలో నిర్థిష్టత అవసరం అని, ఒకవేళ ఈ ఓటమి నిర్థిష్టంగా నిరూపితం అయితే తానే ఓటమిని అంగీకరించి తీరుతానని ట్రంప్ తేల్చిచెప్పారు. తాను మరో నాలుగేళ్లు అధికారంలో ఉండేది లేనిది తేలిపోయేందుకు మరింత సమయం పడుతుందని, మరో నాలుగేళ్లు తానే ఉంటానని తాను విశ్వసిస్తున్నానని, ఒక వేళ ఆ విధంగా జరిగితీరకపోతే 2024 ఎన్నికలకు తాను సిద్ధపడుతానని కూడా తన మద్దతుదార్లతో జరిపిన భేటీలో ట్రంప్ చెప్పారు.

తాను ఓడానని ఇప్పటికైతే అంగీకరించలేదని, అయితే దీనిపై స్పష్టత వస్తే ఓటమి అంగీకారానికి వెనకాడే ప్రసక్తే లేదని తెలిపారు. నవంబర్ 3వ తేదీన జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో విజేతగా డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ నిలిచారు. అయితే ఫలితం అధికారిక ప్రకటనకు ట్రంప్ ఇప్పటికీ తన చట్టపరమైన చర్యలతో, న్యాయస్థానాలలో సవాళ్ల దశలతో అడ్డుగోడగానే నిలిచారు. ‘నేను ఎన్నికలలో ఓడిపోతే లెక్కచేయను. అయితే సక్రమ ఎన్నికలలో ఓడినట్లు లెక్కతేలాల్సి ఉంది. అమెరికన్ల అభిమతానికి గ్రహణం పట్టడాన్ని నేనైతే అంగీకరించను. ఇందుకు నేను ఇష్టపడను. దీని గురించే నేను నా బృందం పోరాడుతోంది. మరో మార్గం లేకపోవడంతో ఇప్పుడు తప్పనిసరిగా ప్రతిఘటనకు దిగాల్సి వచ్చింది’ అని వైట్‌హౌస్ వద్ద మద్దతుదార్లతో జరిగిన హాలీడే పార్టీలో ట్రంప్ చెప్పారు. విలేకరులను రానివ్వకుండా జరిగిన ఈ విందు ఇష్టాగోష్టికి సంబంధించిన భేటీ వివరాలను తరువాత ఆన్‌లైన్‌లో కొన్ని ఫోటోల సమాహారంగా పొందుపర్చారు.

ఎన్నికలలో భారీ స్థాయిలో మోసాలు జరిగాయి. దీనితో అమెరికన్ల ఓట్లకు ద్రోహం జరిగిందని భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే తమకు దీనికి సంబంధించి పలు విధాలైన సాక్షాధారాలు ఉన్నాయని, ఇవన్నీ కూడా ఈ ఎన్నికలలో ఏదో భారీ స్థాయి అవకతవక జరిగిందని స్పష్టం చేస్తున్నాయని ట్రంప్ తెలిపారు. మీడియాలో పలువురు, చివరికి న్యాయమూర్తులు కూడా ఈ ఓటమి సరైనది కాదని చెపుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. వారికి వాస్తవాలు తెలుసునని, అసలు జరిగిందేమిటనే దానిపై క్షేత్రస్థాయిలో వారికి సరైన అవగావహన ఉందని, ఎవరు గెలిచారనేది తెలుసుకున్నారని, అయితే వారు దీనిని బహిరంగా చెప్పేందుకు వారు ముందుకు రావడం లేదన్నారు. మనదే గెలుపు అని చెప్పే శక్తి ఒకటి ఇప్పుడు ఈ దేశానికి అత్యవసరం అన్నారు.

Donald Trump Prepared to accept election defeat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News