Tuesday, April 30, 2024

యాదాద్రి గోపుర తాపడానికి ఎమ్మెల్యే కెపి వివేకనంద విరాళం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ విమాన గోపూరం బంగారు తాపడం కోసం కుత్బుల్లాపూర్ నియోజకవ్గం తరుపున ఎమ్మెల్యే కెపి. వివేకనంద్ గౌడ్ 55,03,500 రూపాయలను కిలో బంగారానికి అందచేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి ఆలయానికి మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మైనం పల్లి హనుమంతరావు,కుకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావుతో కలిసి ఎమ్మెల్యే వివేనంద్ గౌడ్ ఆలయ విమాన గోపూరం తాపడంకోసం విరాళం అందచేయడానికి యాదాద్రికి చేరుకున్నారు.

ఆలయానికి వచ్చిన మంత్రి, ఎమ్మెల్యేలకు సాప్రదాయ పద్దతిగా ఆలయ అధికారులు స్వాగతం పలుకగా శ్రీలక్ష్మీనరసింహుని దర్శించుకున్న మంత్రి, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలను నిర్వహించి ఎమ్మెల్యే వివేకనంద్ కిలో బంగారం గాను నగదు రూ.. 55,03,500 ఆలయ అధికారులకు అందచేశారు. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి, ఎమ్మెల్యేలకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాన్ని అందచేశారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లడుతూ యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు దైవ కార్యక్రమానికి గోపూరం బంగారు తాపడకోసం మేడ్చల్ జిల్లా నుండి 10 కోట్ల రూపాయలను అందచేయడం జరిగిందని తెలిపారు.

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా వివేకనంద్ గౌడ్ తన మోక్కుబడిగా కిలో బంగారం గాను నగదు విరాళం అందచేయడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలనలో తెలంగాణ దిశనే మార్చిరని అన్నారు. తక్కువ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ది వండర్ అని అన్నారు. దేశ ప్రజలు కెసిఆర్ సంక్షేమ అభివృద్ధ్ది వైపు చూస్తున్నరని అన్నారు. మహరాష్ట్ర పర్యటనలో అక్కడి ప్రజలు ముఖ్యమంత్రికి ఘన స్వగతం పలికారని అన్నారు. మూడవసారి బిఆర్‌ఎస్ అధికారంలోకి రావడం కాయమని అన్నారు. కెసిఆర్ అభివృద్ధ్ది చేపడితే బిజేపి పాలనలో అమ్మకాలకు పెడుతున్నారని మంత్రి విమర్శించారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిదులు,నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News