Monday, May 13, 2024

శానిటైజేషన్ కోసం ప్రత్యేక పరికరాన్ని తయారు చేసిన డిఆర్‌డిఓ

- Advertisement -
- Advertisement -

DRDO

 

హైదరాబాద్ : కొవిడ్ వైరస్ నియంత్రణలో భాగంగా డిఆర్‌డిఓ(డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) పబ్లిక్ ప్లేస్‌లను శుభ్రం చేసేందుకు ప్రత్యేక శానిటైజ్ పరికరాన్ని తయారు చేసింది. దీని తయారీ కోసం విడిభాగాలను సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్, ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ -ఢిల్లీ సంస్థ నుంచి తీసుకున్నామని డిఆర్‌డిఓ అధికారులు ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక టెక్నాలజీతో ఈ శానిటైజ్ పరికరాన్ని తయారు చేశామని అధికారులు వెల్లడించారు. ఈ పరికరంతో ప్రతి సెంట్‌కు హైపోక్లోరైట్‌తో శానిటేషన్ చేసేలా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. పోర్టబుల్ వ్యవస్థ కలిగిన పరికరంతో హై లెవల్ ప్రెజర్‌తో రసాయనాలను చల్లవచ్చని అన్నారు. ఒక విడతలో స్పె చేస్తే సుమారు 300 స్కేయిర్ మీటర్ వరకు శానిటైజ్ చేయవచ్చని అధికారులు తెలిపారు. ఈ పరికరంతో ఆసుపత్రులు, పబ్లిక్ ఏరియాలు, ఆఫీస్‌లు, మెట్రో, రైల్వే స్టేషన్లలో కూడా సులభంగా స్పే చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

లాంగ్ ఏరియాలో కూడా స్పే చేయవచ్చుః సెంటర్ ఫర్ ఇండస్ట్రీ పార్టనర్ షిప్‌తో తయారు చేసిన ఈ పరికరంతో దూరపు ప్రాంతంలో కూడా స్పే చేసుకోవచ్చని డిఆర్‌డిఓ అధికారులు వెల్లడిస్తున్నారు. ఒక్క సారి ఓపెన్ చేస్తే సుమారు 3000 స్వేయిర్ ఫీట్ ఏరియాలో కెమికల్‌ను చల్లవచ్చని అధికారులు చెబుతున్నారు. అంతేగాక దీని ట్యాంక్ కెపాసిటీ 50 లీటర్లు కలిగి ఉంటుందని, ఈ రసాయనం 12 నుంచి 15 మీట్లర్ల పరిధి వరకు వస్తుందన్నారు. ఎయిర్‌ఫోర్టులు, హాస్పిటల్స్, మాల్స్, మెట్రోస్టేషన్, ఐసొలేషన్ ఏరియాలు, క్వారంటైన్ సెంటర్స్, హై రిస్క్ ప్రాంతాల్లో రసాయనాలను చల్లడానికి ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుందని డిఆర్‌డిఓ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

 

DRDO a special device made for sanitization
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News