Tuesday, April 30, 2024

మౌలాలిలో పోలీసుపై దాడి

- Advertisement -
- Advertisement -

 police

 

మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని పరిధిలోని మౌలాలీలోని ప్రశాంతినగర్ చెక్ పోస్ట్ వద్ద విధినిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌పై వాహన చోదకులు భౌతికదాడికి పాల్పడిన ఘటన శుక్రవారం నాడు చోటుచేసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గుంపులుగా రావొద్దని, ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణం చేయవద్దని చెప్పినందుకు ఓ పోలీస్ కానిస్టేబుల్ పై ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు. ఓ ద్విచక్ర వాహనంపై యువకుడితో పాటు తల్లిదండ్రులు ప్రయాణిస్తున్నారు. గమనించిన ఓ కానిస్టేబుల్ వారిని ఆపి లాక్ డౌన్ అమల్లో ఉందని.. ద్విచక్ర వాహనంపై ఒకరి కంటే ఎక్కువ మంది ప్రయాణించకూడదని వారించారు. దీంతో ఆ యువకుడితో పాటు అతడి తల్లి తీవ్ర ఆగ్రహానికి గురై కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని దాడి చేశారు. అక్కడే ఉన్న మరికొంత పోలీసులు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఆ యువకుడిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులపై దాడికి పాల్పడిన వారిపై చట్టరీత్యా కేసులో నమోదు చేస్తామని పోలీసు అధికారులు వివరిస్తున్నారు.

 

Attack on police in Moulali
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News