Friday, May 3, 2024

తాగిన మైకంలో మూత్రనాళంలోకి ఛార్జర్ వైర్లు..

- Advertisement -
- Advertisement -

రాంచిః జార్ఖండ్‌లో 35 ఏళ్ల ఓ వ్యక్తి మూత్రాశయం నుంచి మూడడుగుల పొడవున్న మొబైల్ ఛార్జర్ కేబుల్ వైర్లను అక్కడి వైద్యులు విజయవంతంగా తొలగించారు. తాగిన మైకంలో మూడు నెలల క్రితం మూత్రనాళంలోకి మొబైల్ ఛార్జర్ వైర్లను చొప్పించుకున్న ఆ వ్యక్తి ఈ నెల 4న తమ ఆస్పత్రికి వచ్చాడని దమ్కా పట్టణంలోని వైద్యశాల యజమాని అమితారక్షిత్ తెలిపారు. భార్య తనను వదిలి వెళ్లిన బాధలో ఆ వ్యక్తి ఈ చర్యకు పాల్పడినట్టు వైద్యులు తెలిపారు.

తాము రెండు వైర్లను తొలగించామని, ఒక్కొక్కటి దాదాపు అడుగున్నర పొడవు ఉన్నాయని వారు తెలిపారు. మూత్రనాళం గుండా వాటిని లోపలికి చొప్పించుకున్నట్టు బాధితుడు తమకు చెప్పాడని వారు తెలిపారు. నెల రోజుల వరకూ మూత్ర విసర్జనకు ఇబ్బంది కాలేదని, ఆ తర్వాత మరో రెండు నెలలు ఎవరికీ చెప్పుకోలేక నొప్పిని అనుభవించినట్టు బాధితుడు తెలిపాడు. మరికొంతకాలం అలాగే ఉండి ఉంటే కిడ్నీలు దెబ్బతిని క్యానర్‌కు దారి తీసేదని వైద్యులు తెలిపారు.

Drunk man inserts mobile Charger wires in urinary tract

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News