Thursday, May 9, 2024

హీరో హఠాన్మరణం.. విషాదంలో ఇండస్ట్రీ

- Advertisement -
- Advertisement -

Kannada hero Chiranjeevi Sarja

కన్నడ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం అందరికి షాక్‌కు గురిచేసింది. కన్నడలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరిగా ఉన్న చిరంజీవి సర్జా ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు కేవలం 39 సంవత్సరాలు. ఆయన మరణానికి గుండె పోటు కారణం అని తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం ఆయనకు గుండె పోటు రావడంతో బెంగుళూరులోని అపోలో హాస్పిటల్ కి తరలించారు. చికిత్స జరుగుతుండగా ఆయన తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమను శోక సముదంలోకి నెట్టింది. ఆయన ప్రస్తుతం దాదాపు నాలుగు చిత్రాలలో నటిస్తున్నారు. 20 సినిమాలకు పైగా ఆయన నటించడం జరిగింది. 2017లో నటి మేఘనా రాజ్ ని వివాహం చేసుకున్నారు.

Kannada hero Chiranjeevi Sarja dies due to cardiac arrest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News