Friday, May 3, 2024

పిఎంఓతో ఇసి చర్చలు అనధికారికమే

- Advertisement -
- Advertisement -

EC talks with PMO are informal

ఇందులో అనౌచిత్యం ఏమీ లేదు
మీడియా కథనాలపై అధికార వర్గాల వివరణ

న్యూఢిల్లీ: ముఖ్యమైన ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ఎన్నికల కమిషన్, న్యాయమంత్రిత్వ శాఖ మధ్య అవగాహన లోపాన్ని భర్తీ చేయడం కోసం కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సుశీల్ చంద్ర, ఇతర ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అరూప్ చంద్ర పాండేలు ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయంతో చర్చలు జరపడం వివాదాస్పదంగా మారింది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం అధికారులు ప్రధానమంత్రి కార్యాలయంతో ఎలా మాట్లాడారని ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో ఇసి అధికారులు పిఎంఓ కార్యాలయంతో చర్చలు జరపడంలో ఎలాంటి అనౌచిత్యం లేదని అధికార వర్గాలు వివరణ ఇచ్చాయి. గత కొంత కాలంగా ఎన్నికల సంస్కరణలు సంబంధిత అంశాలపై ఎన్నికల సంఘం కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. వీటికి సంబంధించి ఎన్నికల కమిషన్, న్యాయమంత్రిత్వ శాఖ మధ్య అవగాహనా లోపాలను తొలగించడం కోసం గత నవంబర్‌లో వర్చువల్ చర్చలు జరిగినట్లు ఆ అధికారులు చెప్పారు.

ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మధ్య బోలెడన్ని సార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తర్వాత ముగ్గురు ఎన్నికల కమిషనర్లతో అనధికారిక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి కార్యాలయం(పిఎంఓ) చొరవ తీసుకుందని ఆ వర్గాలు తెలిపాయి. కాగా ఉమ్మడి ఓటర్ల జాబితాను రూపొందించడంపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ఒక సమావేశం జరగనుందని, దానికి సిఇసి కూడా హాజరవుతుందని భావిస్తున్నామని న్యాయమంత్రిత్వ శాఖ ఇసికి ఒక లేఖ పంపినట్లు శుక్రవారం ఒక జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది వివాదాస్పదం కావడంతో ఎన్నికల కమిషనర్లు ఈ అధికారిక సమావేశానికి హాజరు కాలేదంటూ అధికార వర్గాలు వివరణ ఇచ్చాయి.

పిఎంఓ కార్యాలయంతో ఇసి అనధికారిక చర్చలు జరిపిన ఫలితంగానే ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తీసుకు రావాలని ఇసి పట్టుబడుతున్న వివిధ ఎన్నికల సంస్కరణలకు గత బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర తెలిసిందని ఆ వర్గాలు తెలిపాయి. ఎన్నికల సంస్కరణల కోసం ఇలాంటి ఒత్తిడి తీసుకు రావడంలో ఎలాంటి అనౌచిత్యం లేదని కూడా ఆ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే సాధారణంగా వివిధ అంశాలకు సంబంధించి న్యాయశాఖ మంత్రులు, లెజిస్లేటివ్ కార్యదర్శులు ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయమైన నిర్వాచన్ సదన్‌లో ఎన్నికల కమిషనర్లను కలుస్తుంటారు. అయితే ఇసి స్వతంత్ర రాజ్యాంగ బద్ధ సంస్థ అయినందున ఎన్నికల కమిషనర్లు ఎప్పుడు కూడా మంత్రులను కలవడంఉండదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News