Tuesday, May 21, 2024

ఈడీ నోటీసులు చట్టవిరుద్ధం: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా గురువారం ఉదయం 11 గంటలకు కేజ్రీవాల్ ఈడీ కార్యాలయానికి హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈడీ ఇచ్చిన నోటీసులపై కేజ్రీవాల్ స్పందిస్తూ… నోటీసులు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని అన్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకోవాడానికే.. బీజేపీ ఆదేశాల మేరకు ఈడీ నోటీసులు ఇచ్చినట్లు ఆరోపించారు. ఈడీ వెంటనే నోటీసును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ అన్నారు.

అయితే, ఈరోజు ఈడీ ఎదుట కేజ్రీవాల్ హాజరుకాలేరని ఆప్ వర్గాలు చెబుతున్నారు. ముందుగా ప్రకటించిన ర్యాలీ కోసం కేజ్రీవాల్.. మధ్యప్రదేశ్ వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. పంజాబ్ సిఎంతో కలిసి మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొనున్నారు. కాగా, గతంలో లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ను సిబిఐ విచారించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News