Saturday, May 4, 2024

తెలంగాణ విద్యా వ్యవస్థ దేశానికే తలమానికం

- Advertisement -
- Advertisement -

ధర్మారం: తెలంగాణ విద్యా వ్యవస్థలో వచ్చిన సమూల మార్పులతో దేశానికే తలమానికంగా నిలిచిందని, మన ఊరు మన బడి కా ర్యక్రమం అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొ ప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా కటికనపల్లిలో రూ.15.15 లక్షలతో నిర్మించిన, ధర్మారం జడ్పీ పా ఠశాలలో 27.96 లక్షలతో నిర్మించిన నూతన భవనాలను ప్రారంభించారు. కటికనపల్లిలో చిన్నారులకు విద్యాభ్యాసం చే శారు. అత్యుత్తమ సేవలు అం దించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో విద్యా వ్యవస్థలో స మూల మార్పులు తీసుకువచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ విద్యపూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా తొలి దశలో 33 శాతం పాఠశాలలు అభివృద్ధి చెందాయని, వచ్చే మూడేళ్లలో పూర్తిస్థాయిలో ప్రభుత్వం పాఠశాలల దశ మారుతుందని ఈశ్వర్ అన్నారు. గతంలో ఏనాడు లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1006 గురుకుల విద్యాలయాల్లో ఆరు లక్షల మంది పిల్లలు విద్యను ఎంబీబీఎస్ సీట్లు సాధించారని, ఈ సంవత్సరం 218 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడం రాష్ట్ర ప్రభుత్వ విద్య అభివృద్ధికి నిదర్శమన్నారు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌ ళిక సదుపాయాలు కలిగించి ఉచితంగా అందిస్తున్న విద్య ద్వారా విద్యార్థుల సంఖ్య పెరిగి ప్రభుత్వ విద్యాలయాలు కలకలలాడుతున్నాయని, ఇది సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కోసం కృషి చేసి పొ రుగు రాష్ట్రాలు ఇక్కడి విద్యా పథకాలను అక్కడ అమలు చేస్తున్నారని ఇది దే శానికి గర్వకారణమని మంత్రి ఈశ్వర్ అన్నారు.

విద్యా వైద్య వ్యవసాయ రం గానికి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తించాలని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వానికి దీవెనలు అందించాలని మంత్రి ఈశ్వర్ విజ్ఞప్తి చే శారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూసుకూరు పద్మజ, జిల్లా సహకార సంఘాల ఫోరం చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, మా ర్కెట్ కమిటీ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, పత్తిపాక సింగిల్ విండో చైర్మన్ నోముల వెంకటరెడ్డి, డీఆర్‌డీఓ శ్రీధర్, ఎంపీడీఓ బీమ జయశీల, ఎంఈఓ పినమల్ల చాయాదేవి, ఎంపీఓ రమేష్, సర్పంచ్‌ల పోరం మండల అధ్యక్షుడు పూసుకూ రు జితేందర్ రావు, రైతుబందు మండల అధ్యక్షుడు పాకాల రాజన్న, రైతుబం దు జిల్లా సభ్యులు పూసుకూరు రామారావు, ఎగ్గెల స్వామి, మండల కోఆప్ష న్ రఫీ, కటికనపల్లి సర్పంచ్ కారుపాకల రాజయ్య, ఉపసర్పంచ్‌లు రామడు గు గంగారెడ్డి, ఆవుల లత, మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రాచూరు శ్రీధర్, మండల మైనారిటీ, సోషల్ మీడియా, విద్యార్థి విభాగాల అధ్యక్షుడు హఫీజ్, దేవి నళినికాంత్, దేవి వంశీ, ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, సహా య కార్యదర్శి దేవి రాజేందర్, కటికనపల్లి బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మానుపాటి సాయిలు, యూత్ అధ్యక్షుడు బోనగిరి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు మడ్డి కొమురయ్య, నూతి మల్లయ్య పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News