Tuesday, April 30, 2024

పీడియాట్రిక్ వైద్యులను అభినందించిన మంత్రి ఈటల

- Advertisement -
- Advertisement -

రూ.14 లక్షలు విలువైన వైద్యపరికరాలను అందించిన ట్వీన్ సిటీస్ బ్రాంచ్

 

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ ట్విన్ సిటీస్ బ్రాంచ్ సభ్యులు వైద్య పరికరాలను అందించారు. గురువారం బిఆర్‌కె భవన్‌లో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలసి ఇచ్చారు. రూ.14 లక్షల విలువైన పరికరాలను గాంధీ , నిలోఫర్ ఆస్పత్రుల్లో సేవలు కొరకు వినియోగించాలని వారు కోరారు. రూ. 7 లక్షలు గాంధీకి, మరో ఏడు లక్షలు నిలోఫర్ హాస్పిటల్‌లో వైద్యపరికరాల కోసం ఉపయోగించాలని పీడియాట్రిక్ వైద్యులు మంత్రిని కోరారు. వీటిలో ఎన్ 95 మాస్కులు, పిపిఇ కిట్స్, ఏరో మిషన్లు కూడా ఉన్నాయి. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ… కరోనా కట్టడి కోసం పీడియాట్రిక్ ట్విన్ సిటీస్ బ్రాంచ్ ముందుకు రావడం సంతోషకరమన్నారు. విపత్కర పరిస్థితుల్లో బాధ్యతగా సేవచేయడం సమాజహితానికి ఉపయోగపడుతుందన్నారు. కరోనా కట్టడి చేసేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రిని కలసిన వారిలో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ట్విన్ సిటీస్ బ్రాంచ్ అధ్యక్షులు సీఎన్ రెడ్డి, కార్యదర్శి భాస్కర్, ట్రెజరర్ శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, అజయ్‌లు ఉన్నారు.

Eetela Rajender congratulated Pediatric Doctors
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News