Saturday, May 4, 2024

భారత్ సైనిక దాడిలో… 8 మంది ఉగ్రవాదులు, 15 మంది పాక్ సైనికులు హతం

- Advertisement -
- Advertisement -

indian army

 

న్యూఢిల్లీ: భారత సైన్యానికి చెందిన శతఘ్ని దళం ఏప్రిల్ 10న నియంత్రణ రేఖ వద్ద కెరాన్ సెక్టార్‌లో డుధ్నియాల్ వద్ద ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని, 15 మంది పాకిస్థాన్ సైనికుల్ని హతమార్చినట్టు భద్రతా వ్యవస్థలోని ఇద్దరు తెలిపారు. అక్రమానికి పాల్పడితే శిక్షించకుండా ఎవరినీ వదిలిపెట్టబోమని పాకిస్థాన్ తెలుసుకునేందుకు ఇది ఒక ఉదాహరణ అని వారిలో ఒకరు చెప్పారు. పాకిస్థాన్ వైపు నుంచి ఎదురవుతున్న కాల్పుల ఉల్లంఘనలకు ప్రతీకారంగా దుధ్నియాల్ వద్ద కిషన్‌గంగ నది ఒడ్డున ఈ దాడి జరిగింది. ఏప్రిల్ 5న కూడా ఈ పర్వత ప్రాంత పట్టణంలో భారత సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులపై దాడి చేసి హతమార్చాయి. చనిపోయిన ఐదుగురు ఉగ్రవాదుల్లో ముగ్గురు జమ్మూకశ్మీర్‌కు చెందినవారు కాగా, మిగిలిన ఇద్దరు ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మహ్మద్ శిక్షణ పొందినవారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న షార్దా, దుధ్నియాల్, షాకోట్ సెక్టార్లపై భారత్ సైనిక దాడిని పాక్ ఆర్మీ ధ్రువీకరించింది.

Eight terrorists killed and 15 Pakistani soldiers killed
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News