Wednesday, May 1, 2024

ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో ఎన్నికల బృందం సమావేశం

- Advertisement -
- Advertisement -
ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అధికారులు చూడాలి:  వికాస్‌రాజ్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం ఏర్పాట్లు వేగవంతం చేసింది. అందులో భాగంగా శుక్రవారం ఎన్నికల ప్రతినిధి బృందం 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించినట్లు సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అనుసరించాల్సిన వ్యుహాలు, ప్రజలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు. అన్నిశాఖలకు చెందిన ఉన్నతాధికారులు పరస్పరం సహకారం చేసుకుని పోలింగ్ శాతం పెరిగేలా చూడాలని పేర్కొన్నారు.
భారత ఎన్నికల సంఘం ప్రతినిధి బృందానికి ధర్మేంద్ర శర్మ, సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్, నితీష్ కుమార్ వ్యాస్, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్, ఆర్కే గుప్త, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్, సంజయ్ కుమార్, అండర్ సెక్రటరీ, అవినాష్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ, హిర్దేష్ కుమార్, డిప్యూటీ కమిషనర్, మనోజ్ కుమార్ సాహూ, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్, బి. నారాయణన్, డైరెక్టర్ జనరల్ (మీడియా), ఎన్‌ఆర్ బుటోలియా, సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, దీపాలీ మసిర్కర్ (డైరెక్టర్-ప్లానింగ్) నాయకత్వం వహించనున్నట్లు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News