Thursday, May 2, 2024

ఎన్నికల కమిషనర్ పదవికి లవాసా రాజీనామా

- Advertisement -
- Advertisement -

Election Commissioner Ashok Lavasa resigns

న్యూఢిల్లీ: భారత్ ఎన్నికల కమిషనర్ పదవికి సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ లవాసా మంగళవారం రాజీనామా చేశారు. ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎడిబి) ఉపాధ్యక్షుడిగా ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. సెప్టెంబర్‌లో ఆయన ఎడిబిలో బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. దీంతో ఆగస్టు 31న తనను రిలీవ్ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పంపినట్టు అశోక్ లవాసా పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్‌గా లవాసా పదవీ కాలం అక్టోబర్ 2022 వరకు ఉండగా ఆయన ముందే రాజీనామా చేశారు. లవాసా రాజీనామా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Election Commissioner Ashok Lavasa resigns

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News