Tuesday, May 7, 2024

నిర్లక్ష్యంతో వేసవిలో విద్యుత్ ప్రమాదాలు

- Advertisement -
- Advertisement -

Electrical accidents in summer with negligence

హైదరాబాద్ : వేసవి వచ్చిందంటే నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఎండాకాలంలో దుకాణాలు,పరిశ్రమ లు, ఇళ్ళలో విద్యుత్ ప్రమాదాలు సర్వసాధారణం గా మారుతున్నాయి. ఇటువంటి ప్రమాదాలు వినియోగ దారులు నిర్లక్షంతోనే జరుగుతున్నాయని ఇంజనీర్లు చెబుతున్నారు.ముఖ్యంగా వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం కూడా ఒక కారణమైతే, నాణ్యతలేని వైర్లను వినియోగించడం, వైరింగ్ వ్యస్థను పునః సమీక్షించకపోవడంతో విద్యుత్ ఘతాలు జ రుగుతుంటాయని చెబుతున్నారు. ఎప్పుడైనా ప్లగ్ లో చిన్నపాటి వెలుగులు (నిప్పు రవ్వలాంటివి)కనిపించినా వెంటనే జాగ్రత్తపడాలని,ఎప్పుడు జరిగేవే కదా అని తేలికగా తీసుకుంటే ప్రాణాపాయం కలగవచ్చని చెబుతున్నారు.చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వాని నివారించ వచ్చని విద్యుత్ ఇంజనీర్లు చెబుతున్నారు.

కారణాలు ఇవి…

*వేసవిలో విద్యుత్‌ప్రమాదాలు జరడానికి ప్రధాన కారణం పాతదైన వైరింగ్ వ్యవస్థ. ఇంటిని శుభ్రం చేసుకుంటాం. అదే విధంగా రంగులు కూడా వేస్తాం.. ఇంకా కావాల్సిన వాటన్నింటని శుభ్రం చేసుకుంటాం. కాని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వైరింగ్ వ్యవస్థను మాత్రం పట్టించు కోం. దాంతో తరుచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
* సరైన ఎర్తింగ్ లేక పోవడం కూడా ఒక ప్రధాన లోపం.ఇళ్ళకు కార్యాలయాలకు,దుకాణాలకు క చ్చితంగా దీనిని ఏర్పాటు చేసుకోవాలి.
* వర్షాకాలంలో కొన్ని ఇళ్ళ గోడలకు విద్యుత్ సరఫరా జరుగుతుంటుందని వింటుంటాం.ఎర్తింగ్ లేక పోవడంతోనే ఇలా జరుగుతుంటుంది. తీగలు పట్టుకుంటే షాక్ కొడుతుంది. దీనిని ఏర్పాటు చేసుకుంటే ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం తక్కువగా ఉంటుంది.
* మీటర్ల మెయిన్ వద్ద సులువుగా మండే పదార్దాలు కిరోసిన్, కాటన్ దుస్తులు,పుస్తకాలు,కాగితాలు లాంటివి ఉంచడంతో విద్యుత్ సరఫరాలో ఏదైనా సమస్య ఏర్పడితే మంటలు వచ్చిన సమయంలో వాటికి త్వరగా అంటుకుంటున్నాయి.
* వైరింగ్ చేయించుకునేటప్పుడు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేయించుకుంటాం .తరువాత కాలంలో ఏసీ ,గీజర్,ఇతర ఎలక్ట్రానిక్ పరికాలను కూడా వినియోగిస్తాం దాంతో వైరింగ్‌పై అధిక భారం పడి విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
* వైర్లు ఏర్పాటు చేసుకునేటప్పుడు ప్రామాణికమైన నాణ్యమైనవి వాడటం లేదు.అందుకు వేసవిలో ఎండలు పెరగడంతో వైర్లపై ఉండే ప్లాస్టిక్ తొడుగు పోయి లోపలి తీగలు తేలి ప్రమాదకరంగా తయారవుతున్నాయి.
పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే….
* అనుభవజ్ఞులైన ఎలక్ట్రిషియన్లతో వైరింగ్ వ్యవస్థను ఒక తనిఖీ చేయించాలి. వారు సూచించే మా ర్పులు చేర్పులు పాటించాలి.
* ఎర్తింగ్ ఏర్పాట్లను చేసుకోవాలి.5 నుంచి 8 ఫీట్ల లోతు గొయ్య త్రవ్వి అందులో బొగ్గులు,ఉప్పు వేసి ఎర్త్‌పవైపును గొయ్యిలో వేసి దానికి వైరును చు ట్టాలి.
*ఐఎస్‌ఐ ప్రమాణాలున్న వైర్లను మాత్రమే వాడా లి. భవిష్తత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని లో డ్ తట్టుకునేలా ఉండే వైర్లను వినియోగించాలి.
* ఎర్త్ ఫాల్ట్ ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ పరికరాలను వినియోగించాలి.
* తెగిన వైర్లు ఉంటే వెంటనే మార్పించాలి .ఇ లాంటి వాటితోనే విద్యుత్ ప్రమాదాలు జరుగుతుంటాయి.
* స్విచ్ బోర్డులో వెలుగులు వస్తుంటే వెంటనే వాటిని తనిఖీ చేయించు కోవాలి.అవసరాన్ని బట్టి కొత్త వాటిని ఏర్పాటు చేసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News