Tuesday, April 30, 2024

విమానం గాల్లో ఉండగానే ఊడిపోయిన ఎమర్జెన్సీ డోర్

- Advertisement -
- Advertisement -

విమానం టేకాఫ్ అయింది. నెమ్మదిగా 16వేల అడుగులకు చేరుకుంది. ఇంతలో ఊహించని సంఘటన జరిగింది. విమానంలోని అత్యవసర ద్వారానికి ఉన్నడోర్ అకస్మాత్తుగా తెరచుకుని, గాల్లోకి ఎగిరిపోయింది. దాంతో భారీ విమానం కుదుపులకు లోనైంది. ప్రయాణికుల హాహాకారాలు. అయితే పైలట్లు చాకచక్యంగా విమానాన్ని వెనక్కి తిప్పి సేఫ్ గా ల్యాండ్ చేయడంతో పెద్దప్రమాదం తప్పింది.

అలాస్కా ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 మాక్స్ విమానం పోర్ట్ ల్యాండ్ నుంచి ఆంటారియాకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 171మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఒక్కసారిగా తలుపు ఊడి గాల్లోకి ఎగిరిపోవడంతో, గాలి ఒత్తిడికి విమానం కుదుపులకు లోనైంది. దాంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే పైలట్లు విమానాన్ని నేర్పుగా వెనక్కు మళ్లించి, పోర్ట్ ల్యాండ్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.

ప్రమాదానికి గురైన విమానం అలాస్కా ఎయిర్ లైన్స్ విమాన శ్రేణిలోకి అక్టోబర్ 1, 2023న వచ్చి చేరింది. అదే ఏడాది నవంబర్ 11నుంచి వాణిజ్య సేవలలోకి ప్రవేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News