Tuesday, April 30, 2024

శ్రీలంకలో ఎమర్జెన్సీ

- Advertisement -
- Advertisement -

కొలంబో: శ్రీలంకలో భద్రతా బలగాలు ఎమర్జెన్సీ ప్రకటించాయి. శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్స  పారిపోవడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. ఆందోళనకారులు ప్రధాని ఇంట్లోకి దూసుకెళ్లారు. ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. శ్రీలంక పశ్చిమ రాష్ట్రాలలో భద్రతా బలగాలు కర్ఫూ ప్రకటించాయి. ప్రధాని నివాసం ఖాళీ చేయాలని ఆందోళనకారులకు ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. లంక్ష అధ్యక్షుడు గొటాబాయ రాజపక్స మాల్దీవులలో తలదాచుకున్నారు. తన కుటుంబంతో కలిసి వైమానిక విమానంలో లంక నుంచి పారిపోయినట్లు సమాచారం.

అధ్యక్షడి భవనాన్ని ఆందోళనకారులు ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. అధ్యక్షుని రాజప్రాసాదంలోని రహస్య బంకర్‌ను ఒక వార్తాసంస్థ కూడా కనుగొనడంతో నిరసనకారులు ఆసక్తితో ఆ బంకర్‌ను చూడడానికి తరలివస్తున్నారు. ఈ బంకర్‌కు నకిలీ కప్‌బోర్డు అమర్చి ఉంది. భవనం లోని దాగి ఉన్న ప్రదేశాలను మరుగుపరిచే ఈ కప్‌బోర్డును నిరసనకారులు పగులగొట్టారు. బంకర్‌తో మెట్లు, ఎలివేటర్ అనుసంధానంగా ఉన్నాయి. అయినా దాని తలుపు మాత్రం మూసే ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News