Saturday, May 11, 2024

నవంబర్ 3 నుంచి ఇంజనీరింగ్ తరగతులు

- Advertisement -
- Advertisement -

Engineering Colleges to Start from Nov 3

మనతెలంగాణ/హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ తరగతులు నవంబర్ 3నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జెఎన్‌టియుహెచ్ 2022-23 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి డిసెంబరు 28 వరకు మొదటి సెమిస్టర్ తొలి విడత తరగతులు ఉంటాయి. డిసెంబరు 29 నుంచి జనవరి 4 వరకు మొదటి మిడ్ టర్మ్ పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 5 నుంచి మార్చి 2 వరకు రెండో విడత తరగతులు జరుగుతాయి. మార్చి 3 నుంచి ఏప్రిల్ 1 వరకు సెమిస్టర్ ముగింపు పరీక్షలు ఉంటాయి. రెండో సెమిస్టర్ తరగతులు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతాయి. జూన్ 10 వరకు తరగతులు కొనసాగుతాయి. మధ్యలో మే 15 నుంచి 27 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 12 నుంచి 17 వరకు మొదటి మిడ్ టర్మ్ పరీక్షలు జరుగుతాయి. అదే నెల 19 నుంచి ఆగస్టు 12 వరకు రెండో విడత తరగతులు జరుగుతాయి. ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 9 వరకు సెమిస్టర్ ముగింపు పరీక్షలు ఉంటాయి. ఎంటెక్, ఎం.ఫార్మసీ మొదటి ఏడాది తరగతులు అక్టోబరు 26 నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి సెమిస్టర్ పరీక్షలు మార్చి 13 నుంచి 25 వరకు జరుగుతాయి. రెండో సెమిస్టర్ తరగతులు వచ్చే ఏడాది మార్చి 27 నుంచి ప్రారంభమవుతాయి. మే 15 నుంచి 27 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 6 వరకు రెండో సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయి. ఎంబీఏ, ఎంసీఏ రెండో ఏడాది తరగతులు నవంబరు 10 నుంచి ప్రారంభం కానున్నాయి.

Engineering Colleges to Start from Nov 3

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News