Saturday, May 11, 2024

‘ఎంత చిత్రం’…

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ’ ఫస్ట్ సింగిల్ ‘పంచెకట్టు’ పాటకు అన్ని వర్గాలా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండవ సింగిల్ ‘ఎంత చిత్రం’ పాటని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈనెల 9న విడుదలయ్యే ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ని సర్‌ప్రైజ్ చేయబోతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ పోస్టర్‌లో నాని, నజ్రియా నజీమ్‌ల కెమిస్ట్రీ లవ్‌లీగా వుంది. నాని నిద్రపోతున్నట్లు నటిస్తూ నజ్రియాపై తల ఉంచడానికి ప్రయత్నిస్తుండగా.. నజ్రియా ప్రేమగా నానిని చెంపపై చేయివేసి ఆపడం బ్యూటీఫుల్ గా వుంది. సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళ వర్షన్‌కి ‘అడాడే సుందరా’ అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వర్షన్‌కి ‘ఆహా సుందరా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Entha Chithram Single Releasing on May 9th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News