Tuesday, May 7, 2024

డీప్ ఫేక్ స్కామ్‌లో కోల్ ఇండియా మాజీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కోల్ ఇండియా మాజీ అధికారి రాధాకిషన్ డీప్‌ఫేక్ స్కామ్‌లో రూ 40,000 పొగొట్టుకుని తలపట్టుకోవల్సి వచ్చింది. అవసరంలో ఉన్న తన స్నేహితుడికి సాయం చేయాలనే ఆయన మంచితనం చివరికి ఆయనను చిక్కుల్లో నెట్టింది. వీడియో కాల్ ద్వారా తమను తాము స్నేహితులుగా పరిచయం చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తుల మోసానికి ఈ అధికారి దెబ్బతిన్నారు. ఎఐ పరిజ్ఞానంతో తాను చిరకాల మిత్రుడిని అని నమ్మిస్తూ వీడియోకాల్‌లో కనబడ్డాడు సోదరి ఆసుపత్రులలో చికిత్స పొందుతోందని దీనంగా తెలియచేసుకుంటూ ఈ దగాకోర్టు పలు మార్లు సాయానికి అభ్యర్థించినట్లు తెలిసింది. నాలుగు నెలల దర్యాప్తు తరువాత ఈ దుండగులలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఇప్పటకీ తప్పించుకు తిరుగుతున్నాడు. జులైలో ఈ మాజీ అధికారికి చేదు అనుభవం ఎదురైంది. గుర్తు తెలియని నెంబరు నుంచి ముందుగా ఓ ఫోన్ వచ్చింది. తరువాత వీడియో కాల్ వచ్చింది. స్నేహితులంటే ఎంతో అభిమానం ఉన్న మాజీ అధికారికి వేణుకుమార్ అని తెలియచేసుకుంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు.

చాలా కాలం క్రితం మంచి స్నేహితులమని తెలియచేశాడు.ఓ రోజు వీడియో కాల్ చేసి తన సోదరి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉందని, సర్జరీకి కనీసం రూ 40000 కావాలని సాయం చేయాలని కోరాడు. స్నేహితుడిని ఆదుకోవడం మానవ ధర్మమని భావించి మరో ఆలోచన లేకుండా ఈ మాజీ అధికారి గూగుల్ ఫోన్ ద్వారా అడిగిన డబ్బులు పంపించాడు. ఇంతటితో ఆగలేదు. తరువాత కొద్దిరోజులకు ఈ వ్యక్తి తిరిగి తనకు రూ 35000 కావాలని కోరడంతో ఈ మాజీ అధికారికి అనుమానం వచ్చింది. దీనితో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూర్తి స్థాయి దర్యాప్తు తరువాత నాలుగు నెలలకు కేరళలోని కోజికోడ్ నగర పోలీసులు ఈ సాయం స్కామ్‌ను ఛేదించారు. ఒక్క నిందితుడు షేక్ ముర్తుజామియా హయత్ భాయ్‌ను అరెస్టు చేశారు. ఈ వ్యక్తిది గుజరాత్ అని తేలింది. ఇక అహ్మదాబాద్‌కు చెందిన ప్రధాన నిందితుడు కౌశల్ షా ఇప్పటికీ ఫరారీలో ఉన్నాడు.

మోసం గురించి ఈ విధంగా తెలిసింది
తనను ఎవరో తెలివిగా మోసం చేశారని ఈ అధికారి చివరికి తన చిన్ననాటి స్నేహితుడు వేణు నిజమైన నెంబరును ఇతరుల ద్వారా తీసుకుని మాట్లాడాడు. తాను ఇటీవలి కాలంలో ఫోన్ చేయలేదని, డబ్బులు ఇతర విషయాలు ఏమీ వేణు ప్రస్తావించకపోవడంతో, వేణులాగా నటించి వేరొక్కరు మోసగించినట్లు గుర్తించి చివరకు విషయం పోలీసులకు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News