Thursday, May 2, 2024

బోడుప్పల్‌లో పాతనేరస్థుడు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Ex-Convict Arrested in Boduppal

బోడుప్పల్: తాళాలు వేసిన ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న పాతనేరస్థుడిని అరెస్టు చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మల్కాజ్‌గిరి డిసిపి రక్షిత మూర్తి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నేరస్థుల వివరాలను వెల్లడించారు. నగరంలోని చింతల్ బస్తీ ప్రాంతానికి చెందిన మేళ్లచెరువు రామారావు (52) గతంలో అనేక దొంగతనాల కేసుల్లో జైళ్లకు వెళ్లి వచ్చాడు. జైళ్లో ఉన్న సమయంలో ఇతర నేరస్థులతో పరిచయం చేసుకోని తాళాలు వేసి ఉన్న ఇండ్లతో పాటు రక్షణ లేని అపార్టెంట్లను టార్గెట్ చేసుకోని తన గ్యాంగ్‌తో తాళాలు విరగోట్టి చోరీలకు పాల్పడుతున్నారు. ఇతనిపై తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 61 కేసులు ఉన్నట్లుగా తెలిపారు.

ఇతను 2009లో జైలులో ఉన్న సమయంలో కె.శ్రీనివాస్ తో పరిచయం చేసుకోని అనంతరం ఇతర ముఠా సభ్యులతో తాళాలు వేసి ఉన్న ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడడం జరుగుతుంది. ఈ క్రమంలో వీరు చోరిచేసిన సోమ్మును పీర్జాదిగూడ కార్పొరేషన్ కు చెందిన సరిత అనే మహిళ వద్ద దాచి, సమయం దొరికినప్పుడు అమ్మి సోమ్ము చేసుకునే వారు. మంగళవారం ఉదయం మేడిపల్లి లో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో మేడిపల్లి పోలీసులకు వీరు అనుమానస్పదంగా కనపడడంతో మేళ్లచెరువురావు ,కె.శ్రీనివాస్ లను అదుపూలోకి తీసుకుని విచారణ చేపట్టడంతో వారు చేసిన నేరాలను ఒప్పుకున్నట్లు డిసిపి రక్షిత మూర్తి తెలిపారు. చోరీ చేసిన సొత్తును ఎక్కడ దాచారో తెలుపడంతో 24లక్షల సొత్తు, వీలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు గతంలో అనేక చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారని వీరిపై పీడియాక్ట్ నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని రక్షిత మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా నేరస్థులను పట్టకోవాడంలో విశేషంగా కృషి చేసిన పోలీసులకు రివార్డు అందచేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్ రావు ,మేడిపల్లి సీఐ అంజిరెడ్డి ,డీఐ మక్బూల్ జానీ లతో పాలు ఎస్పైలు,సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News