Sunday, April 28, 2024

మాజీ కౌన్సిలర్ దారుణహత్య

- Advertisement -
- Advertisement -

జనగామలో మార్నింగ్ వాక్ చేస్తుండగా మాజీ కౌన్సిలర్ పులిస్వామిని బైక్‌తో ఢీకొట్టి గొడ్డలితో నరికి
హత్యచేసిన దుండగులు భూవివాదమే కారణం?

Ex TDP Councillor Killed in Jangaon

మన తెలంగాణ/జనగామ ప్రతినిధి: జనగామ పట్టణ మాజీ కౌన్సిలర్, టిడిపి నేత పులి స్వామి (52) గురువారం ఉదయం దారుణహత్యకు గురయ్యారు. జనగామ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ సమీపంలో వాకింగ్ చేస్తున్న పులి స్వామిపై గొడ్డలితో దాడిచేసి అతికిరాతకంగా నరికి చంపారు. కాగా ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. విలేకరుల సమావేశంలో డిసిపి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మృతుడు పులి స్వామికి, నిందితుల కుటుంబ సభ్యుల మధ్య గత 25 సంవత్సరాలుగా యశ్వంతాపూర్ గ్రామ శివారులో మెయిన్ రోడ్ ప్రక్కన సర్వే నంబర్ 82/72లోని 2.30 ఎకరాల భూమివిషయంలో భూవిదాదం నడుస్తున్న నేపథ్యంలో ఇరువురు సివిల్ కోర్టును ఆశ్రయించారు. తరువాత కొంతకాలానికి గడ్డం నర్సింహ చనిపోగా అతని కుటుంబ సభ్యులతో వివాదం నడుస్తుంది.

అయితే బుధవారం సివిల్ కోర్టులో మృతుడికి అనుకూలంగా తీర్పు రావడంతో తమ తాత ఆస్తి తమకు దక్కకుండా చేస్తున్నాడని జనగామ పట్టణానికి చెందిన గడ్డం నిఖిల్, గడ్డం ప్రవీణ్ పులి స్వామిపై కక్షకట్టి పథకం ప్రకారమే ఉదయం 7 గంటలకు జనగామ పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ దగ్గర వాకింగ్ చేస్తున్న పులి స్వామిని ఏపీ 28 డీఈ 8081 నంబర్ గల బజాజ్ పల్సర్ బైక్‌తో ఢీకొట్టి కిందపడిన అతనిపై గొడ్డలితో దాడిచేసి అతికిరాతకంగా హత్యచేసి చంపారని డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. మృతుడి భార్యత భూవివాదం సమస్యలుంటే కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప ఇలాంటి ఘటనలకు పాల్పడొద్దని, ఒకవేళ ఇలాంటి దారుణాలకు పాల్పడితే కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. మృతుడి భార్య నిందితులు గడ్డం నిఖిల, ప్రవీణ్‌కుమార్, కవిత, అభిరాం, దాసయ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీ వినోద్‌కుమార్, సీఐ మల్లేష్‌యాదవ్, ఎస్సై శ్రీనివాస్, రవికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Ex TDP Councillor Killed in Jangaon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News