Saturday, April 27, 2024

ఇంటర్ ఫేయిల్…డెంటల్ డాక్టర్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నకిలీ డిగ్రీతో దంత వైద్యుడిగా చెలామణి అవుతున్న వ్యక్తిని సౌత్‌ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడికి సహకరించిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ బిడిఎస్ సర్టిఫికేట్, ట్రేడ్ లైసెన్స్, డెంటల్ ట్రీట్‌మెంట్ సామగ్రి, రెంబు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… ఫలక్‌నూమాకు చెందిన ఖాజా ముజామిల్ ఉద్దిన్ నకిలీ డాక్డర్, ముసారాంబాగ్‌కు చెందిన సయిద్ అబ్దుల్ అస్లాం ఫుడ్ డెలివరీ బాయ్‌ను అరెస్టు చేశారు. ఖాజాముజామిల్ 2016లో ఇంటర్ ఫేయిల్ కావడంతో మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న మిస్వాక్ డెంటల్ ఆస్పత్రిలో పనిచేశాడు.

2016 నుంచి 2020 వరకు పనిచేయడంతో డెంటల్‌కు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకున్నాడు. తర్వాత తన స్నేహితుడు సయిద్ అబ్దుల్ అస్లాం అలియాస్ అస్లాం సహాయంతో కర్నాటక స్టేట్ డెంటల్ కౌన్సిల్ పేరుతో నకిలీ డెంటల్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. దీనిని సయిద్ అబ్దుల్ అస్లాం తయారు చేశాడు. పాతబస్తీలోని ఆక్సిజన్ డెంటల్ క్లినిక్‌లో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి అదుపులోకి తీసుకున్నాడు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ రమేష్ నాయక్,ఎస్సైలు సాయిరాం, అనంతచారి, రాఘవేంద్ర రెడ్డి తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News