Sunday, April 28, 2024

రైతుకు కరెంట్ బిల్లు రూ.3.71 కోట్లు…

- Advertisement -
- Advertisement -

Electricity bill

Farmer gets electricity bill of over Rs 3 crore
జైపూర్: వ్యవసాయం చేసే రైతులకు మామూలుగా కరెంట్ బిల్లు రెండు లేదా మూడు వేల రూపాయలు వస్తాయి కానీ ఏకంగా ఓ రైతుకు రెండు నెలలు కలిసి రూ. 3.71 కోట్ల కరెంట్ బిల్లు రావడంతో అవాక్కయ్యాడు. సెప్టెంబర్ మూడో తేదీ లోపు కరెంట్ బిల్లు చెల్లించకపోతే రూ.7.16 లక్షల పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని తెలిపాడు. లబోదిబోమంటూ స్థానికంగా అజ్మీర్ విద్యుత్ విత్రాన్ నిగమ్ లిమిటెడ్‌కు వెళ్లి అధికారులను కలిశాడు. మీటర్ రీడింగ్ చేసే ఆపరేటర్ వల్ల ఈ తప్పిదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. అదే సర్వీస్ నంబర్‌తో చెక్ చేయగా రూ.6414 బిల్లు వచ్చిందని తెలిపాడు. పాత బిల్లు స్థానంలో కొత్త బిల్లు వినియోగదారుడికి ఇచ్చామని విద్యుత్ అధికారి తెలిపాడు. ఈ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బిల్లుపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వాధికారుల పనితనానికి ఇదే నిదర్శనమని కొందరు కామెంట్లు చేస్తున్నారు. బిల్లుతో రైతు గుండెకు షాక్ తగిలి ఉంటుందని కామెంట్ల రూపంలో వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News