Sunday, April 28, 2024

చిన్న షాప్‌కు కోటి రూపాయల కరెంట్ బిల్లు

- Advertisement -
- Advertisement -

అమరావతి: జువెలరీ షాపుకు కోటి రూపాయల కరెంట్ బిల్లు రావడంతో  ఆ షాప్ యజమాని షాక్‌కు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కొట్టూరు టౌన్‌లోని పాలకొండ రోడ్డులో జి అశోక్ అనే వ్యక్తి దుర్గా జువెలరీ అనే షాపును నిర్వహిస్తున్నాడు. సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 2 వరకు 1,01,56,116 రూపాయల కరెంట్ బిల్లు రావడంతో అశోక్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే విద్యుత్ అధికారులను కలిసి తనకు కోటి రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందని తెలిపాడు.

Also Read: లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు…

కరెంట్ బిల్లు సవరిస్తామని, సాంకేతిక లోపంతో వచ్చి ఉంటుందని విద్యుత్ అధికారలు తెలిపారు. ప్రతి నెలా తన షాపుకు కరెంట్ బిల్లు రూ.7000 నుంచి 8000 వరకు వస్తుందని అశోక్ తెలిపాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్కోసారి యూనిట్ నంబర్లు జంప్ కావడంతో కరెంట్ బిల్లు తప్పుగా వస్తుందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. విద్యుత్ అధికారుల అలసత్వం కనిపిస్తుందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కరెంట్ బిల్లు చూసి యజమానికి కరెంట్ షాక్ తగిలి ఉంటుందని నెటిజన్లు మీమ్స్ వైరల్ చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News