Sunday, May 12, 2024

ఆ యూనివర్సిటీ చేప మృతి… దేశాధ్యక్షుడు సంతాపం…

- Advertisement -
- Advertisement -

 

చేప చనిపోతే అధ్యక్షుడు సంతాపం తెలపడం ఏంటని అనుకుంటున్నారు. కాపెర్బల్ట్ విశ్వ విద్యాలయంలో చేప చనిపోవడంతో జాంబియా దేశ అధ్యక్షుడు ఎడ్గార్ లుంగూ సంతాపం తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థులు కొవ్వొత్తులు వెలిగించి క్యాంపస్ చుట్టూ నిలబడి సంతాపం తెలిపారు. 22 సంవత్సరాల వయసు ఉన్న మాఫిసి అనే పెద్ద చేప యూనివర్సిటీ విద్యార్థులకు అదృష్టం తెచ్చిపెడుతోందని నమ్ముతున్నారు. ఆ చేపను చూసి వెళ్తే అదృష్టం కలిసి రావడంతోపాటు పరీక్షలలో పాస్ అవుతున్నామని విద్యార్థులు నమ్ముతున్నారు. ఆ చేపను చూసిన వెంటనే తమలో ఒత్తిడి తగ్గుతుందని ఎందరో విద్యార్థులు పేర్కొన్నారు. 20 సంవత్సరాల నుంచి చేప ఇక్కడే ఉంటుందని విద్యార్థి నాయకుడు లారెన్స్ కసాండే తెలిపాడు. మాఫిసిని ప్రస్తుతం ఖననం చేయలేదని, చేప కళేభరానికి కెమికల్స్ పూసి అక్కడే ఉంచుతామని కసాండే పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News