Sunday, April 28, 2024

రైతు బాంధవుడు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -
  • డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, తెరాస రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్

నాగర్‌కర్నూల్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతాంగ అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, తెరాస రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఆదేశానుసారం గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా రైతులు, నాయకులు సంబరాలు నిర్వహించారు.

అనంతరం బిఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జక్కా రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ ఓర్వలేకనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్షమని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చిన రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

కరోనా వంటి విపత్కర పరిస్థితులు, ఎంఆర్‌బిఎం పరిమితులు, నోట్ల రద్దు, జిఎస్టి వంటి కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయం పడిపోయిన తెలంగాణలో రైతుల కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్నారని, 19 వేల కోట్ల రైతు రుణమాఫీ నిర్ణయం విప్లవాత్మక నిర్ణయమని అన్నారు. రైతాంగ సంక్షేమం కోసం పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10 వేల చొప్పున రైతుబంధు అందజేయడమే కాకుండా 5 లక్షల రైతుబీమా, రైతు వేదికలు, నిరంతరాయ నాణ్యమైన ఉచిత కరెంట్, సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులతో పాటు వ్యవసాయానికి ముఖ్య అవసరమైన సాగునీరు అందుబాటులోకి తెచ్చి రాష్ట్రాన్ని వ్యవసాయ వనరుగా, ధాన్యాగారంగా తీర్చిదిద్దారన్నారు.

కేవలం 24.29 లక్షల మెట్రిల్ టన్నుల ధాన్యం సేకరణ నుంచి అనాతి కాలంలోనే కోటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసే విధంగా ఐదింతలు పంట దిగుబడులను పెంచిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు. తెలంగాణ రైతాంగం కోసం వారు పండించిన మొత్తం పంటను ఎంత నష్టమైన భరించి వేల సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను రైతుల చెంతనే ఏర్పాటు చేసి కనీస మద్ధతు ధరతో సేకరిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని అన్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటున్న సిఎం కెసిఆర్‌కు తెలంగాణ రైతాంగం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మెన్ కుర్మయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ కల్పన, జెడ్పిటిసి శ్రీశైలం, ఎంపిపి సత్తవరం నరసింహా రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, మాజీమార్కెట్ యార్డు చైర్మెన్ దొడ్ల ఈశ్వర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్ బాబు రావు, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News