Monday, May 6, 2024

రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

- Advertisement -
- Advertisement -

జమ్మికుంట : రైతులు వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని చైతన్య వ్యవసాయ కళాశాల డైరెక్టర్ డాక్టర్ చేరాలు సూచించారు. మంగళవారం స్థానిక కృషివిజ్ఞాన కేంద్రంలో 95వ వ్యవస్థాపక, సాంకేతిక దినోత్సవం సందర్భంగా 3వ రోజు మహిళ సంఘాల సభ్యులకు, మహిళ రైతులకు, మహిళ మత్స రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో డీన్ ఆఫ్, అగ్రికల్చర్, చైతన్య వ్యవసాయ కళాశాల డైరెక్టర్ డాక్టర్ చేరాలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసిఎఆర్)సూచనలతో నూతన సాంకేతిక పద్ధతులను, పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగాలని సూచించారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, నేల ఆరోగ్యం కూడా ఎంతో అవసరం అని అన్నారు.

అధిక గాఢత కల్గిన రసాయన ఎరువులను వాడడం తగ్గించుకోవాలని, సేంద్రీయ పద్ధతులపై అవగాహన పెంచుకుని నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. సీనియర శాస్త్రవేత్త వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ ఈ సంవత్సరంను చిరుధాన్యాల సంవత్సరంగా పేర్కొనడం జరిగిందని, కరోనా తరువాత చాలామందిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల పోషకాహారం కోసం చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేవికే శాస్త్రవేత్తలు, సిబ్బంది, సర్వోదయ ఎన్,.జి,ఓ సభ్యులు, వీరితో పాటు మహిళ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News