Friday, May 3, 2024

ఉచితాలు వద్దంటున్న రేవంత్‌కి రైతులే తగిన బుద్ది చెప్పాలి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని పిసిసి ఛీప్ రేవంతర్‌రెడ్డి వ్యాఖ్యలపై నిరసనగా రైతులు మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేయడంతోపాటు ఆయన చిత్రపటానికి పిండ ప్రదానం చేసారు. రేవంత్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేసారు. సిఎం కేసిఆర్ వ్యవసాయాన్ని పండుగ చే స్తుంటే ఉచితాలు వద్దంటున్న టిపిసిసి అద్యక్షుడు రేవంత్‌రెడ్డికి రైతులే త గిన బుద్ది చెప్పాలని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్‌రా వు పిలుపునిచ్చారు.

బుధవారం బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ పిలుపు మేరకు మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయం పక్కన ఉన్న రైతువేదిక భవనం నుండి రా జీవ్ చౌక్ వరకు బీఆర్‌ఎస్ శ్రీణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రాజీవ్ చౌక్ వద్ద రేవంత్‌రెడ్డి బొ మ్మను దహనం చేశారు. రేవంత్ దొంగ.. డౌన్‌డౌన్ రేవంత్ అంటూ బిఆర్‌ఎస్ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. అనంతరం వారు మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డి పేదలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని, ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఇక 3 గంటల కరెంటు వస్తుందని, మళ్లీ పా తరోజులు వస్తాయన్నారు. రైతులు వ్యవసాయం గురించి రేవంత్‌రెడ్డికి ఏం తెలుసని ప్రశ్నించారు.

24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే రైతులు త మకు అనుకూలమైన సమయంలో పొలాలకు నీళ్లు పారించుకుంటున్నారని తెలిపారు. ఒకపక్క బిజెపి, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలంటోంది, మరోపక్క కాంగ్రెస్ పార్టీ దళారులకు కోసం, బీజేపి పార్టీ అదాని, అ ంబాని కోసం పనిచేస్తే, కెసిఆర్ మాత్రమే రైతుల కోసం పనిచేస్తున్నారని వెల్లడించారు. ప్రజల తీర్పుతో రేవంత్‌కు, కాంగ్రెస్‌కు చెంప చెళ్లుమనాలని సూచించారు. రైతులను అవమానించిన రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. రైతన్న సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ నాయకులు, సిఎం కేసిఆర్ పాలన లో రైతులకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.

నాడు తెలంగాణ ఉద్యమంపై తుపాకి ఎక్కుపెట్టిన మనిషే, నేడు పచ్చబడ్డ తెలంగా ణను చూసి విషం చిమ్ముతున్నాడని ఆరోపించారు. ఈకార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అద్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ వై స్ ఛైర్మన్ కుర్ర విష్ణు, డిసిసిబి డైరెక్టర్ బంటు శ్రీనివాస్, ప్యాక్స్ ఛైర్మన్ రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, బిఆర్‌ఎస్ నాయకులు, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు ఇంఛార్జిలు, ఆయా గ్రా మాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఉపసర్పంచ్‌లు, గ్రామపార్టీ అధ్యక్షులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News