Sunday, May 5, 2024

18న దేశవ్యాప్త రైల్‌రోకో

- Advertisement -
- Advertisement -

18న దేశవ్యాప్త రైల్‌రోకో.. రైతు సంఘాల పిలుపు
 చట్టాల రద్దే మా డిమాండ్ : రైతు నేత రాకేశ్‌తికాయత్

న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం) ఫిబ్రవరి 18న నాలుగు గంటల దేశవ్యాప్త రైల్‌రోకోకు పిలుపునిచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు రైల్‌రోకో నిర్వహిస్తామని తెలిపింది. అంతేగాక ఫిబ్రవరి 12న రాజస్థాన్‌లో టోల్‌గేట్ వసూళ్లను నిలిపి వేస్తామని హెచ్చరించింది. ఈ నెల ప్రారంభంలో ఎస్‌కెఎం ఇచ్చిన మూడు గంటల రహదారుల దిగ్బంధనం పిలుపునకు కాంగ్రెస్‌సహా పలు పార్టీలు మద్దతు తెలిపాయి. కేంద్రంలో అధికారం మారాలని తాము కోరుకోవడంలేదని, వ్యవసాయ చట్టాలను రద్దు చేసి కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)కి చట్టబద్ధత కల్పించాలన్నదే తమ డిమాండని బికెయు నేత రాకేశ్‌టికాయిత్ స్పష్టం చేశారు. తమ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి రైతు సంఘాల నేతలు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారని ఆయన తెలిపారు. బుధవారం సింఘు సరిహద్దు వద్ద ఆందోళన కొనసాగిస్తున్న రైతులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎస్‌కెఎంలో ఎలాంటి విభేదాలు లేవని, రైతు సంఘాలన్నీ ఐక్యంగానే ఉన్నాయిని, చీలికలపై కేంద్రం భ్రమలు పెట్టుకోవద్దంటూ ఆయన హితవు పలికారు. దేశవ్యాప్తంగా భారీ బహిరంగసభలు నిర్వహించి ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. 40 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.

Farmers Union announced Rail Strike on Feb 18

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News