Monday, April 29, 2024

మా సహనాన్ని పరీక్షించొద్దు

- Advertisement -
- Advertisement -

పొద్దెరగని కొత్త బిచ్చగాడిని తలపిస్తున్న బిజెపి
వాళ్ల మాదిరిగా మాట్లాడడం మాకు చేతకాదు
బిజెపి నాయకత్వం ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి
మేము తలుచుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపిలు మిగలవు
ప్రజల తీర్పుతో మేము అధికారంలోకి వచ్చాం
రైతుల ఆత్మహత్యలకు, తెలంగాణలో ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్ కాదా
తెలంగాణ పేరు పలికే అర్హత దానికి లేదు: హాలియా భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్/నల్గొండ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించారు. ప్రతిపక్షాలపై తీవ్ర స్థా యిలో విరుచుకపడ్డారు. పిచ్చిపిచ్చి పనులు చేస్తే తొ క్కి పడేస్తామని హెచ్చరించారు. తమ సహనానికి కూ డా హద్దు ఉంటుందన్నారు. మేము తలుచుకుంటే దు మ్ము దుమ్ము అయిపోతారన్నారు. ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకుని కూర్చోలేదన్నారు. మీలాంటి వాళ్ళను చాలామందిని చూసామన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా రాష్ట్ర బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వాళ్లలా మాట్లాడాలంటే తమకు చేతకాక కాదన్నారు. బిజెపి, కాంగ్రెస్ నేతలు హద్దు మీరితే ‘తొక్కిపడేస్తాం జాగ్రత్త’ అని హెచ్చరించారు. తెలంగాణ అన్న పదాన్ని పలికే అర్హత కూడా వారికి లేదంటూ ధ్వజమెత్తారు. బిజెపి నాయకత్వం ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరో నామినేట్ చేస్తే వచ్చిన ప్రభుత్వం కాదని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణను ముక్కలు చేసిన ఇతర రాష్ట్రాల్లో కలిపిన వా ళ్లు ఎవరు? అంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యా ఖ్యలతో విరుచుకుపడ్డారు. ఉద్యమ సమయంలో ఏం చేశారంటూ నిలదీశారు. టిఆర్‌ఎస్ అంటే వీరుల పార్టీ అని అన్నారు.. బుధవారం హాలియాలో టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగిన భారీ బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. సభ ప్రారంభం కాగానే కొందరు సిఎం ప్రసంగాన్ని అడ్డుకునే ప్ర యత్నం చేశారు. ఇది కెసిఆర్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ‘వారిపై ఊగిపోతూ… మీలాంటి కుక్క లు చాలా ఉన్నాయి…వారిని తరమేయండి అని పోలీసులను ఆదేశించారు. ఇతరుల బహిరంగ సభకు వద్దకు వచ్చి వీరం గం చేయడం ఎందుకు? వారు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే సభలు పెట్టుకోవచ్చు కాదా? అని అన్నారు. తాము తలుచుకుంటే రాష్ట్రంలో ఆ రెండు పార్టీలుమిగలవన్నారు. ఇప్ప టికైనా ఆ పార్టీల నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని సూచించా రు. హద్దు మీరినప్పుడు ఏం చేయాలో తమకు తెలుసన్నారు. తమకు ప్రజలు తీర్పు ఇచ్చారని ఢిల్లీ వాళ్లు చెబితే రాలేదన్నా రు. కాంగ్రెస్‌కు తెలంగాణ పేరు పలికే అర్హత లేదన్నారు. రాష్ట్రం లో రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరన్నారు. తెలంగాణ లో ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు.
పొలంబాట పేరుతో వంచన
కాంగ్రెస్ నాయకులు ’పొలం బాట’ అని ప్రజలను వంచిస్తున్నారని కెసిఆర్ మండిపడ్డారు. రైతుబాట కార్యక్రమం ఎందు కు? రైతులు బాగున్నందుకా? మీ హయాంలో రైతులకు ఎరువులు కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2007లో తాను కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశామన్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో ని సమస్యలు ఎత్తిచూపామన్నారు. అయితే అప్పటి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వబోమన్నా రు. పైగా ఏం చేసుకుంటారో చేసుకోండి అని కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానిస్తే కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉన్నారన్నా రు. ఇప్పుడేమో పెద్ద పెద్ద డైలాగులు కాంగ్రెస్ నాయకులు చెబుతారు కానీ అభివృద్ధి ఏమీ చేయలేదన్నారు. ‘తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని కిరణ్‌కుమార్ అన్నాడు. ఆనాడు ఒక్క కాంగ్రెస్ నేత ఏ ఒక్కరైనా అయినా మాట్లాడారా? కమీషన్ల కోసమే ప్రాజెక్ట్‌లు కట్టామని మాట్లాడుతున్నారు. మీరు నాగార్జునసాగర్ కమీషన్ల కోసమే కట్టారా? అని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు రైతు బంధులు కాదని, రాబంధులు అని వ్యాఖ్యానినంచారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు కూడా నల్గొండకు నీళ్లు ఆపితే ఎవరూ నోరెత్తలేదన్నారు. నల్గొండ జిల్లాలో దశాబ్ధాల కాలంగా ఉన్న ఫ్లోరైడ్ సమస్య గురించి కాంగ్రెస్‌లో ఎ ఒక్కరైనా మాట్లాడారా? అని ఆయన నిలదీశారు. రైతుబంధు, రైతుబీమా వస్తుందన్నందు కు పోరుబాట చేస్తారా? కాంగ్రెస్ హయాంలో కనీసం ఎరువు లు, విత్తనాలు ఇవ్వలేదు. విజయడెయిరీ మూసివేస్తే కాంగ్రెస్ నేతలు నోరు తెరవలేదు. కాంగ్రెస్ పార్టీది దోపిడీ రాజ్యం దొంగల రాజ్యమన్నారు. ఆ పార్టీ నాయకులు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారని సిఎం కెసిఆర్ మండిపడ్డారు.
టిఆర్‌ఎస్ పాలనలోనే అభివృద్ధి
ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని సిఎం కెసిఆర్ అన్నారు. ప్రస్తుత టిఆర్‌ఎస్ పాలనలో తెలంగా ణ శరవేగంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఆరేళ్లలోనే అధ్బుతమైన ప్రగతిని సాధిస్తూ దేశానికే పలు అంశాల్లో రోల్‌మోడల్‌గా నిలిచిందని సిఎం కెసిఆర్ అన్నారు. అభివృద్ధికి నోచుకోని అన్ని వర్గాల అభ్యన్నతికి చేయూతనిచ్చామన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు దేశంలో ఎక్కడైనా జరిగాయా? అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై గ్రామాల్లో చర్చలు పెట్టాలన్నారు. కెసిఆర్ కిట్ రూపంలో పేదింటి ఆడబిడ్డలను ఆదుకుంటున్నామన్నారు. ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డకు రూ.12 వేలు ఇస్తున్నామన్నారు. అలాగే యాదవులు, మత్స్యకారుల కోసం పథకాలు తెచ్చామన్నారు. రూ.160 కోట్లతో 1.6 కోట్ల చేప పిల్లలు అందజేశామన్నారు. కులవృత్తు లు చేసుకునే వారికి పెద్దఎత్తున అభివృద్ధికి అనేక కార్యక్రమా లు చేపట్టామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చామన్నారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో ప్రతి గ్రామానికి నీటి కుళాయిల ద్వారా తాగునీటిని అందిస్తున్నామన్నారు. పెద్దఎత్తున నీటి ప్రాజెక్టులను పూర్తి చేసిన కారణంగా రాష్ట్రంలో పంటల ఉత్పత్తులు రికార్డు స్థాయి కి చేరుకున్నాయని సిఎం కెసిఆర్ తెలిపారు. ఫలితంగా ఎఫ్‌సిఐకి దేశంలో అత్యధిక వడ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మితం అవుతున్న డిండి ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.
జిల్లాలో వంద శాతం ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేశామన్నా రు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణే అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం నల్గొండ జిల్లాకు మొత్తం తాగునీరు ఇవ్వడంతో పాటు సాగునీటి కూడా ఇచ్చి పూర్తిగా సస్యశ్యామలం చేస్తామన్నారు. ప్రతి యాదవ కుటుంబానికి గొర్రె లు ఇస్తున్నామన్నారు. ప్రతి ఏడాది రైతుబంధు ద్వారా రూ.15 వేల కోట్లు ఇస్తున్నామన్నారు. అలాగే రైతులు కూర్చోని పంటలపై పరస్పరం చర్చించుకునేందుకు రాష్ట్రంలో 2,600 రైతు కేంద్రాలు పెట్టామన్నారు. అలాగే అభివృద్ధికి అందనంత దూరంలో ఉన్న 3,400లకుపైగా తండాలను గ్రామపంచాయతీలు చేశామన్నారు. అవి పంచాయితీలుగా మార్చినప్పటికీ తండాల ప్రాంతాలన్నీ శరవేగంగా అభివృద్ధికి నోచుకుంటున్నామన్నారు. ఇలా టిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ఎంతో నిబద్ధతతో పనిచేస్తుంటే ప్రతిపక్షాలు పూర్తి స్వార్ధ రాజకీయాలు చేస్తుండడం.. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయడం తగదన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ఇప్పటికైనా కాంగ్రెస్, బిజెపి పార్టీలు మానుకుంటే మంచిదన్నారు. లేనిపక్షంలో ప్రజలు తగు రీతిలో బుద్ధిచెబుతారని సిఎం కెసిఆర్ హెచ్చరించారు.
నల్గొండ జిల్లాపై వరాల జల్లు
నల్లగొండ జిల్లాపై సిఎం కెసిఆర్ వరాల జల్లు కురిపించారు. జిల్లాలో ఉన్న 844 ప్రతి గ్రామపంచాయతీలకు రూ.20 లక్షలు మంజూరు చేస్తామని అన్నారు. అలాగే ప్రతి మండల కేంద్రానికి రూ. 30 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీ రూ. 10 కోట్లు ఇస్తామన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ 5 కోట్లు, మిగతా మున్సిపాలిటికీ కోటి రూపాయలు మంజూరు చేస్తామని అన్నారు. ఇందుకు సంబంధించిన 186 కోట్లు విడుదల చేస్తామన్నారు.ఇవి వట్టి ప్రకటనలు కావని, ఒకటి, రెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన జీవోలు విడుదల చేస్తామని సిఎం తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం
నల్లగొండ ఆయకట్టుకు శాశ్వతంగా నీళ్లు అందిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. జిల్లాలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలను సంవత్సరన్నర వ్యవధిలోగా నిర్మాణ పనులను పూర్తి చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడగమని సిఎం కెసిఆర్ ఛాలెంజ్ చేశారు. త్వరలోనే పెద్దదేవులపల్లికి నీళ్లు అందిస్తామని, కృష్ణ, గోదావరి అనుసంధానం చేసి రైతులు కాళ్లు కడుగుతామన్నారు. నల్గొండ జిల్లాను గతంలో ఎవరూ పట్టించుకోలేదన్నారు. గత పాలకులు పట్టించుకోనందున జిల్లా చాలా నష్టపోయిందన్నారు. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.2,500 కోట్లతో ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టిందని సిఎం కెసిఆర్ వివరించారు.
చెప్పేది అబద్ధమైతే టిఆర్‌ఎస్‌ను ఓడించండి
ఈ సభలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలను వివరించానన్నారు. అలాగే అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అందిస్తునన పథకాలనుచెప్పానని సిఎం కెసిఆర్ అన్నారు. ఇందులో తాను చెప్పింది అబద్దమైతే త్వరలో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలో టిఆర్‌ఎస్ ఓడించాల్సిందిగా ఆయన కోరారు. ప్రజల మేలుకోసం పరితపించే టిఆర్‌ఎస్ పార్టీని ఆదరిస్తేనే మేలు జరుగుతుందన్నారు.
భూవివాద సమస్యలకు రెండు రోజుల్లో పరిష్కారం
నెల్లికల్లు, చింతలపాలెం ప్రాంతాల్లో నెలకొన్న భూనిర్వాసితు ల సమస్యలను రెండు రోజులలో పరిష్కరిస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. స్వయంగా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఇప్పటి కే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ సమస్య పరిష్కరించి త్వరలో పట్టాలు ఇస్తామన్నారు. కరోనా కారణంగా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
త్వరలోనే పోడు భూములకు పరిష్కారం
రాష్ట్రంలో నెలకొన్న పోడు భూముల సమస్యకు కూడా త్వరగా పరిష్కరిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. తాను స్వయంగా జిల్లాల పర్యటనలు చేస్తాన్నారు. జిల్లాలనే సుమారు రెండు నెలల పాటు మకాం వేసి పోడు సమస్యను అక్కడిక్కడే తెగ్గగొడతానని అన్నారు.
ఒక్కొక్కరికి లక్ష రూపాయలు
తెలంగాణ వచ్చాక వృత్తి కులాలను ఆదుకున్నామని సిఎం కెసిఆర్ చెప్పారు. యాదవులు, గొల్లకురమలకు గొర్రెలను పంపి ణీ చేశామన్నారు. మార్చి తర్వాత మరో విడత గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు. మత్స్యకారులకు ఉచితంగా చేపల పంపిణీ చేశామన్నారు. ఇక గ్రామాల్లో కటింగ్ షాపులు నడుపుకునే నాయి బ్రాహ్మణులు.. మోడ్రన్ సెల్లూన్లు పెట్టుకుంటామంటే మార్చి తర్వాత ఒక్కొక్కరికి రూ.లక్ష అందిస్తామన్నారు. ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం అమలు చేస్తామన్నారు. యాదవ కుటుంబానికి గొర్రెల యూనిట్ ఇప్పించే బాధ్యత తనదేన్నారు. మత్స్యకారులను ఆదుకుంటున్నాం. రూ.160 కోట్ల కోటి 60లక్షల చేప పిల్లలు ఉచితంగా ఇచ్చాం. అనేక వృత్తి కులాలను పైకి తెచ్చే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మోడ్ర న్ సెలూన్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఒక్కొక్క నాయి బ్రాహ్మణ సోదరుడికి లక్ష రూపాయల చొప్పున మంజూరు చేయబోతున్నాం అని కెసిఆర్ తెలిపారు.
రైతు బంధు కింద రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
దేశంలో ఏ రాష్ట్రం చేపట్టిన విధంగా రైతులకు రైతుబంధు పథ కం కింద యేటా రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. అలాగే ఎక్కడా లేని విధంగా 2,600 రైతు కేంద్రాలు నిర్మించామన్నారు. పంటల విషయమై రైతులు కేంద్రాల్లో చర్చలు జరగాలన్న లక్షంతో వీటిని నిర్మించామన్నారు. రానున్న బడ్జెట్‌లో జిల్లా, మండ ల పరిషత్‌లకు ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలను నిర్మిస్తున్నామన్నారు. రెవెన్యూ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు కూడా ఇప్పటి వరకు దేశంలో మరెక్కడా లేవని సిఎం కెసిఆర్ అన్నారు. కేవలం పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తవుతున్నాయన్నారు. త్వరలోనే భూసమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారబోతోందన్నారు.

రూ.1000 కోట్లతో దళితుల సాధికారత
ఎస్‌సిల సాధికారతకు రానున్న వార్షిక బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయిస్తున్నామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఆ మొత్తాన్ని మరింత పెంచుతామన్నారు. దానిని తానే మానిటర్ చేస్తాన్నారు. బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసి చూపిస్తాను అన్నారు. కులం, మతం, వివక్ష లేకుం డా తెలంగాణ మొత్తాన్ని అభివృద్ధి చేయాలని అహోరాత్రులు కష్టపడి పని చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో దళిత జాతి ఇంకా వెనుకబడి ఉందని వాపోయారు. దళిత జాతి వెనుకకు ఉన్నన్ని రోజులు మనం సిగ్గు పడే పరిస్థితి, బాధ పడే పరిస్థితి ఉంటుందన్నారు. కాలి వేలి నుంచి నెత్తి వరకు అన్నీ బాగుంటే నే శరీరం బాగుంటుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు బాగుంటేనే మనం బాగుంటామన్నారు. ఈ నేపథ్యంలోదళితులను బాగు చేసుకునే బాధ్యత కూడా మనమీదే ఉందన్నారు. కెసిఆర్ వట్టి మాటలు చెప్పడ, ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు చేశామని, ఇప్పుడిప్పుడే కొంత అభివృద్ధి కనపడుతోందని సిఎం కెసిఆర్ అన్నారు. ఇంకా దళితులు పైకి రావాలని ఆయన ఆకాంక్షించారు.

త్వరలో రేషన్ కార్డులు, పింఛన్ల ప్రక్రియ
త్వరలో కొత్త ఫించన్ల ప్రక్రియ చేపడతామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. ప్రతి గ్రామానికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఆయ భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ వర్గాలకు ఇస్తున్న ఫించన్లు ఇప్పటి వరకు ఏ రాష్టం కూడా చేపట్ట లేదన్నారు. ఏనాడు నిధులు తమ ప్రభుత్వం ఆలోచించలేదని, సమాజంలో అట్టడుగులో ఉన్న వారిందరిని ఆదుకువాలన్నదే తన తపనగా సిఎం కెసిఆర్ పేర్కొన్నరు.

CM KCR Speech at Haliya Sabha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News