Sunday, May 5, 2024

కోహ్లీని రెచ్చగొడితే నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాడు

- Advertisement -
- Advertisement -

Finch advised his teammates to be careful when confronting Kohli

 

సహచరులకు ఫించ్ హితవు

సిడ్నీ: టీమిండియా సారథి విరాట్ కోహ్లీని ఎక్కువగా రెచ్చగొడితే ప్రత్యర్థులు ఎవరనేది చూడకుండా నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాడని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేర్కొన్నాడు. గురువారంనుంచి అడిలైడ్‌లో తొలిటెస్టులో కోహ్లీతో తలపడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తన సహచరులకు ఫించ్ సూచించాడు. ఇరు జట్ల మధ్య ఎన్నో ఏళ్లుగా మాటల యుద్ధం జరుగుతోందని.. ఈ సారి కూడా అలా జరిగే అవకాశముందని సందేహం వ్యక్తం చేశాడు. ఇరు జట్లలో ఢీ అంటే ఢీ అనే ఆటగాళున్నప్పుడు కచ్చితంగా ఇలాంటివి చోటు చేసుకునే వీలందన్నాడు.

అయితే ఇప్పుడు ఇరు జట్ల మధ్య సుహృద్భావ వాతావరణం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీని రెచ్చగొట్టవద్దని ఫించ్ సలహా ఇచ్చాడు. ఒక వ్యక్తిగా మైదానం బైట కోహ్లీ ప్రశాంతంగా ఉండాడని ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ అన్నాడు. విరాట్ ఆటను అర్థం చేసుకుని మెలగుతాడన్నాడు. అలాగే ఐపిఎల్‌లో బెంగళూరు జట్టు కెప్టెన్‌గా విరాట్ ప్రణాళికలు చూసి ఆశ్చర్యపోయానన్నాడు. ప్రతి ఆటగాడి పట్ల పూర్తి నమ్మకంతో ఉంటాడన్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల ముగిసిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఫించ్ సారథ్యంలో వన్‌డే సిరీస్‌ను 2 1తేడాతో దక్కించుకోగా 1 2తేడాతో టి20 సిరీస్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో ఈ నెల 17నుంచి రెండు జట్లూ 4 టెస్టుల సిరీస్‌లో తలపడనున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News