Sunday, April 28, 2024

7వ విడత కింద రాష్ట్రాలకు జిఎస్‌టి నిధులు

- Advertisement -
- Advertisement -

7వ విడత కింద రాష్ట్రాలకు జిఎస్‌టి నిధులు
మరో రూ.6వేల కోట్లను విడుదల చేసిన కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ
తెలంగాణకు దక్కిన రూ.129 కోట్లు

Centre releases GST Compensation to States

మన తెలంగాణ/హైదరాబాద్: జిఎస్‌టి పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ్ మరోసారి రుణాలు విడుదల చేసింది. 7వ విడతగా అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.6వేల కోట్ల రూపాయల రుణాలను విడుదల చేసున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలు కలిపి రూ.42 వేల కోట్ల రుణం కేంద్రం ఇచ్చింది. 7వ విడుత నిధుల్లో తెలంగాణకు రూ.129 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.125 కోట్లు విడుదల చేసింది. ఇప్పటివరకు విడుదల చేసిన రుణాల్లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1055.79 కోట్లు, తెలంగాణకు రూ.559.02 కోట్లును విడుదల చేసింది. నాలుగు రోజుల క్రితం 6వ విడత కింద రూ.6వేల కోట్ల మేర రుణాలు కేంద్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఏడవ విడత కింద విడుదల చేసిన ఆరువేల కోట్లలో ఇందులో 23 రాష్ట్రాలకు రూ.5,516.60 కోట్లుగా పేర్కొన్నది. జిఎస్‌టి కౌన్సిల్‌లో సభులుగా ఉన్న ఢిల్లీ, జమ్మూ, కాశ్మీర్, పుదుచ్చేరికి రూ.483.40 కోట్లు విడుదల చేసింది. కాగా అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కింలకు జిఎస్‌టి అమలు కారణంగా ఆదాయంలో అంతరం లేదని మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.

దీంతో జిఎస్‌టి అమలు కారణంగా తలెత్తే ఆదాయంలో రూ.1.10 కోట్ల కొరతను తీర్చడానికి ప్రత్యేక రుణాలు తీసుకునే విండో ద్వారా నిధులను అందించడంతో పాటు, కొరతను తీర్చడానికి ఆప్షన్ 1ను ఎంచుకునే రాష్ట్రాలకు రాష్ట్రాల జిఎస్‌డిపిలో 0.5శాతంకు సమానమైన అదనపు రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.ఈ నిబంధన ప్రకారం 28 రాష్ట్రాలకు 1,06,830 కోట్లు మంజూరు చేశారు.జిఎస్‌డిపిలో 0.50 శాతం అదనపు రుణాలు తీసుకోవడం మరియు ప్రత్యేక విండో ద్వారా సేకరించిన నిధులు రాష్ట్రాలకు చేరాయి.

Centre releases GST Compensation to States

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News