Sunday, May 12, 2024

ఇటలీ దిగ్గజ ఫుట్‌బాలర్ రోసీ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Italian Legendary Footballer Rossi dies at 64

మిలన్: ఫుట్‌బాల్ ప్రపంచానికి మరో షాక్ తగిలింది. డీగో మరడోనా విషాదం మరువక ముందే మరో దిగ్గజ ఆటగాడు కన్ను మూశాడు. అతనే ఇటలీ దిగ్గజ ఫుట్‌బాలర్ పాలో రోసీ (64). ఆయన మరణవార్తను భార్య ఫెడెరికా కాపెల్లేటి ఇన్‌స్టాగ్రాంలో ధ్రువీకరించింది. ‘రోసీ… మిస్ యు ఫరెవర్’ అంటూ ఉద్వేగ భరితమైన పోస్టు చేసింది.1982లో జరిగిన ప్రపంచకప్‌లో ఇటలీ జగజ్జేతగా నిలవడంలో రోసీ కీలకపాత్ర పోషించాడు.ఆ ప్రపంచకప్‌లో పాలో రోసి ఆరు గోల్స్‌తో టాప్‌స్కోరర్‌గా గోల్డెన్ బూట్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా గోల్డెన్ బాల్ అవార్డు దక్కించుకున్నాడు. ప్రపంచకప్‌లో టైటిల్‌తో పాటుఈ రెండు అవార్డులు గెలుచుకున్న ముగ్గురిలో ఒకరుగా నిలవడం విశేషం.

Italian Legendary Footballer Rossi dies at 64

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News