Friday, April 26, 2024

మొదటి గూడ్స్

- Advertisement -
- Advertisement -

First coal-laden train from Sattupalli started

 

మనతెలంగాణ/హైదరాబాద్ : సత్తుపల్లి నుంచి బొగ్గుతో లోడ్ అయిన మొదటి రైలు శనివారం ప్రారంభమయ్యింది. ఇది కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ ఫర్ జెన్‌కో (కెటిపిజి)కు రవాణా అయ్యింది. ఇది భద్రాచలం రోడ్ టు సత్తుపల్లి సెక్షన్‌లో నడిపిన మొదటి రైలు అని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. భద్రాచలం రోడ్ టు సత్తుపల్లి నూతన రైల్వే లైను ప్రాజెక్టు దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో ప్రతిష్టాత్మకమయ్యిందని అధికారులు పేర్కొన్నారు. సత్తుపల్లి ప్రాంతంలోని ఎస్‌సిసిఎల్ గనుల నుంచి బొగ్గు రవాణా కోసం దక్షిణ మధ్య రైల్వే మెస్సర్స్ సింగరేణి కాలరీస్ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్)చే సంయుక్తంగా ఈ నూతన రైల్వే లైను వేస్తున్నారు. అందులో భాగంగా భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు రైల్వే లైను మొత్తం పూర్తయ్యిందని అధికారులు తెలిపారు.

మూడు క్రాసింగ్ స్టేషన్లు కోయగూడెం, చెంద్రుగొండ, భావన్నపాలెం

మరోవైపు భద్రాచలం టు భావన్నపాలెం మధ్య విద్యుదీకరణ పూర్తయ్యిందని, భావన్నపాలెం నుంచి సత్తుపల్లి వరకు (సుమారు 15 కిమీలు) పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. భద్రాచలం రోడ్ టు సత్తుపల్లి నూతన రైల్వే లైను 2010, 11లో మంజూరు కాగా, ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తం (సుమారుగా రూ.927.94 కోట్లు) అని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఇందులో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రూ.618.55 కోట్ల భాగస్వామ్యం ఉంది. ఈ ప్రాజెక్టు తెలంగాణలోని బొగ్గు గనుల ప్రాంతంలో 54.10 కిమీల మేర ఉంటుంది. ఇందులో మూడు క్రాసింగ్ స్టేషన్లు (కోయగూడెం, చెంద్రుగొండ, భావన్నపాలెం) ఉన్నాయి.

ప్రాజెక్టుతో కలిగే ప్రయోజనాలు

ఈ ప్రాజెక్టు రైల్వేకు, మెస్సర్స్ ఎస్‌సిసిఎల్‌లకు ప్రయోజనకరమని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఇది సత్తుపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని బొగ్గు గనుల నుంచి పర్యావరణ అనుకూలంగా, వేగవంతంగా బొగ్గు రవాణాకు ఉపకరిస్తుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఇది థర్మల్ విద్యుత్ ప్లాంట్ల బొగ్గు డిమాండ్‌ను నెరవేరుస్తుండడంతో పాటు రైల్వేలకు అదనపు లోడింగ్ ఆదాయాన్ని కలిగిస్తుంది. ఇది సరుకు రవాణా కోసం ఈ ప్రాంతానికి రైలు అనుసంధానాన్ని కల్పిస్తుంది. రోడ్డు రవాణా తగ్గడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. ఇది మౌలిక సదు పాయాల అభివృద్ధికి దోహదం చేయడంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని అధికారులు తెలిపారు.

విద్యుదీకరణ పనుల్లో జాప్యం లేకుండా….

ప్రాజెక్టు మొత్తం పూర్తి కానప్పటికీ ప్రస్తుత బొగ్గు డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే ఈ రైల్వే లైనులో మొదటి రైలును ప్రారంభించ డానికి కృషి చేసిన దక్షిణ మధ్య రైల్వే కన్‌స్ట్రక్షన్ విభాగం అధికారులను, సిబ్బందిని, మెస్సర్స్ ఎస్‌సిసిఎల్ యంత్రాంగాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్‌చార్జి) అరుణ్‌కుమార్ జైన్ అభినందించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం సాధించేలా విద్యుదీకరణ పనులను జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు మొత్తం పనులన్నీ పూర్తయితే వివిధ ప్రాంతాలకు బొగ్గు రవాణా చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, దీంతో విద్యుత్ ప్లాంట్‌లకు పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News