Saturday, April 27, 2024

గోదావరికి జలకళ!

- Advertisement -
- Advertisement -
భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం
అప్రమత్తంగా ఉండాలని సిడబ్యుసి హెచ్చరిక

హైదరాబాద్:  ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నది జలకళను సంతరించుకుంటోంది. మహారాష్ట్ర , చత్తిస్‌గఢ్ రాష్ట్రాల్లో గోదావరికి ఉపనదులుగా ఉన్న ప్రాణహిత , సీలేరు, తదితర నదులకు భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో గోదావరి నదిలో కూడా వరద ప్రవాహంలో కదలిక వచ్చింది. గురువారం భద్రాచలం వద్ద గోదావరి నదలిలో నీటిమట్టం 13అడుగుల స్థాయికి మించిపోయింది. తాలిపేరు ప్రాజెక్టులోకి కూడా ఎగువ నుంచి వరదనీటి చేరిక పెరగటంతో ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేలసి 2691 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాలను దృష్టిలో పెట్టుకుని భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర జలసంఘం హెచ్చరికలు చేసింది.

రెండు రోజులుగా గోదవరిలో వరదనీరు ప్రవహిస్తోంది. ఒక్కసారిగా పది అడుగుల మేర నీటి ప్రవాహాలు పెరగటంతో నదిపరివాహకంగా లోతట్టున ఉన్న చిన్నచిన్న దుకాణాలు వరదనీటిలో మునిగిపోయాయి. శుక్రవారం ఉదయానికి గోదావరిలో నీటిమట్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేసి ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదికి వరద ప్రవాహం మరింత పెరిగింది. లక్ష్మి బ్యారేజికి 1,16, 750క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. బ్యారేజి 36గేట్లు ఎత్తివేసి నీటిని విడుల చేస్తున్నారు. బ్యారేజి నుంచి గేట్ల ద్వారా, పంపుల ద్వారా మొత్తం 1.40లక్షల నీరు బయటకు వెళుతున్నట్టు అధికారులు వెల్లడించారు.అన్నారం బ్యారేజిలో నీటి నిలువ ఏడు టిఎంసీలకు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News