Wednesday, May 8, 2024

జనవరి 26న ‘రావణాసుర’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ ధమాకా,వాల్తేరు వీరయ్య సినిమాల సక్సెస్‌ తో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తన తాజా చిత్రం ‘రావణాసుర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు ఈ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ రవితేజ ఆర్ టి టీమ్‌వర్క్స్, అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో గ్రాండ్‌గా రూపొందుతోంది. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్నారు.

జనవరి 26న రవితేజ పుట్టినరోజు జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక సందర్భంలో ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే రవితేజ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను విడుదల చేయగా దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా హై యాక్షన్‌ లో ప్రజంట్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.

హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
ఏప్రిల్ 7, 2023న వేసవిలో రావణాసుర థియేటర్స్ లో గ్రాండ్‌ గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News