Sunday, April 28, 2024

విశాఖ మీదుగా తొలి ప్రైవేటు రైలు

- Advertisement -
- Advertisement -

first private train over Visakhapatnam

రైల్వే శాఖ ప్రతిపాదన రెండు, మూడు నెలల్లోనే ప్రైవేట్ రైళ్లను పట్టాలెక్కించేందుకు కసరత్తు
160 కి.మీల వేగంతో ప్రయాణం,  100 శాతం సమయపాలన పాటించేలా నిబంధనలు
సమయ పాలన పాటించకపోతే జరిమానా పారిశుధ్యం, ఇతర వ్యవస్థ నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు

విశాఖ: తొలి ప్రైవేటు రైలు త్వరలోనే విశాఖ మీదుగా వెళ్లేలా అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ లైన్ల నుంచి ఆదాయం ఎక్కువగా వస్తుండడంతో మొదట ఇక్కడి నుంచే నడిపించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తం గా ప్రైవేటీకరించే రైళ్లలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నవే అధికంగా ఉన్నాయి. మొదటిదఫాలో ప్రైవేటు భాగ స్వామ్యంతో నడిచే 150 రైళ్లలో 30వరకు తెలుగు రాష్ట్రా లకు సంబంధించినవే ఉన్నాయి. ముందస్తుగా పలు రా ష్ట్రాల్లో నడిచే రైళ్లను ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నడ పాలని గత నవంబర్‌లో రైల్వే శాఖ ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. అయితే రానున్న రెండు, మూడు నెలల్లో ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కనున్నాయి.

విడతల వారీగా

దేశవ్యాప్తంగా 2023 నుంచి ప్రైవేటు రైళ్లను తీసుకురావా లన్నదే రైల్వే మంత్రిత్వ శాఖ ప్రణాళిక. ఒకేసారి కాకుం డా ప్రతి ఏడాది విడతల వారీగా పలు రైళ్లను అనుమతిం చాలని భావిస్తోంది. అయితే తొలి రైలును విశాఖ మీదు గానే నడపాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇందు లో భాగంగా సికింద్రాబాద్ వయా చర్లపల్లి టు శ్రీకాకు ళం వరకు ప్రైవేటు రైలు వచ్చే అవకాశాలున్నట్టు రైల్వే అ ధికారులు పేర్కొంటున్నారు. డివిజన్ మీదుగా నడిచే తొ లి ప్రైవేటు రైలు ఇదే అయ్యే అవకాశం ఉందని అధికారు లు తెలిపారు. ఇప్పటివరకు ఉన్న ప్రతిపాదనల ప్రకారం తెలంగాణ, ఎపి మధ్య విశాఖ మీదుగా పలు రైళ్లను ప్రతి పాదించారు. వీటితో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడి శా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు వెళ్లే రైళ్లు విశాఖ మీదుగా నడవనున్నాయి.

16 కోచ్‌లతో డిజైన్

త్వరలోనే పట్టాలు ఎక్కుతున్న ప్రైవేటు రైళ్లకు 16 కోచ్‌లు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. వీటన్నింటినీ ఎసి కోచ్‌లుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ రైళ్లను 160 కి.మీ వేగంతో నడవ నుండగా, వీటిని రైల్వే పైలెట్లు, గార్డులే తీసుకెళ్లనున్నా రు. రైళ్లను 100 శాతానికి తగ్గ కుండా సమయపాల న పాటించేలా నిబంధనలను రూపొందిస్తున్నారు. ప్రైవే టు కంపెనీల తప్పిదాలకు పెనాల్టీలు వేయనున్నారు. పా రిశుధ్యం, ఇతర వ్యవస్థల నిర్వహణలో అత్యున్నత ప్ర మాణాలు చేపట్టేలా చర్యలు చేపడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటీకరించే రైళ్ల వివరాలు

విజయనగరంపూరీ మూడు సార్లు), హావ్‌డా చెన్నై మీదుగా విజయవాడకు (వారానికి 7 సార్లు), పాటలీ పుత్రబెంగళూరు టిసిటిబి (వారానికి 7 సార్లు), గోరఖ్‌పుర్‌బెంగళూరు టిసిటిబి (వారానికి రెండు సా ర్లు), ప్రయాగ్‌రాజ్ సుబేదార్‌గంజ్‌బెంగళూరు టిసిటిబి (వారానికి రెండు సార్లు), సికింద్రాబాద్‌శ్రీకాకుళం (వా రానికి 7 సార్లు), హైదరాబాద్‌తిరుపతి (వారానికి 7 సార్లు), గుంటూరుహైదరాబాద్ (వారానికి 7 సార్లు), గుంటూరుకర్నూలు (వారానికి 7 సార్లు), తిరుపతి వారణాసి (సికింద్రాబాద్ మీదుగా వారానికి 2 సార్లు), తిరుపతినర్సాపురం (విజయవాడ మీదుగా వారానికి ఒకసారి), విశాఖపట్నంవిజయవాడ (వారానికి 7 సా ర్లు), విశాఖపట్నంబెంగళూరు టిసిటిబి (వారానికి రెం డు సార్లు), సంబల్‌పుర్‌బెంగళూరు టిసిటిబి (వారానికి ఒకసారి), హావ్‌డా సికింద్రాబాద్ (వారానికి 7 సార్లు) భగత్‌కీ కోఠి (జోధ్‌పుర్)సికింద్రాబాద్ (వా రానికి 7 సార్లు), చెన్నైలోకమాన్య తిలక్ టెర్మినల్ (వారానికి రెండు సార్లు), చెన్నైతిరుపతి (వారానికి ఒకసారి), పుదుచ్చేరికాచిగూడ (వారానికి 7 సార్లు), చెన్నై నిజా ముద్దీన్ (వారానికి 7 సార్లు), కొచువేలి (తిరువనంతపు రం) లండింగ్ (అసోం) (వారానికి మూడు సార్లు), బెంగళూరు టిసిటిబి లండింగ్ (వారానికి మూడు సార్లు), మైసూరుభువనే శ్వర్ (విజయవాడ మీదుగా) (వారానికి 7సార్లు), న్యూ ఢిల్లీ బెంగళూరు టిసిటిబి (వారానికి 7 సార్లు), హావ్ డాబెంగళూరు టిసిటిబి (వారానికి 7 సార్లు), హతి యా (రాంచీ, జార్ఖండ్)బెంగళూరు టిసిటిబి (వారా నికి 2 సార్లు) నడిచే రైళ్లను ప్రైవేటీకరణ చేయనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News