Saturday, April 27, 2024

శోభా.. నోరు అదుపులో పెట్టుకో

- Advertisement -
- Advertisement -

MLA Sunke Ravi Shankar Fires on bodiga shobha

 ఎవరి చరిత్ర ఎంటో ప్రజలకు తెలుసు
సిఎం కుటుంబాన్ని, పార్టీని విమర్శిస్తే సహించేది లేదు
తీరు మారకుంటే గుణపాఠం తప్పదు
మాజీ ఎంఎల్‌ఎపై చొప్పదండి ఎంఎల్‌ఎ సుంకె రవిశంకర్ ఆగ్రహం

కరీంనగర్: చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ నోరు అదుపులో పెట్టుకోవాలని, సభ్య సమాజం తలదించుకునేలా దిగజారుడు మాటలు మాట్లాడం మానుకోవాలని, సిఎం కెసిఆర్ కుటుంబ సభ్యులను, ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్‌ను, ఎంపి సంతోష్ కుమార్‌ను మరోమారు విమర్శిస్తే ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హెచ్చరించారు. శనివారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో చొప్పదండి నియోజకవర్గం టిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరానికి ముందు బొడిగె శోభ చరిత్ర, ఆర్థిక పరిస్థితి ఎంటో అందరికి తెలిసిందేనని అన్నారు. పార్టీ ఒకసారి జెడ్పిటిసిగా టికెట్ ఇచ్చిందని, మరోసారి చొప్పదండి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపిస్తే ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ధనార్జనే ధ్యేయంగా పరిపాలించి కోట్ల అక్రమాస్తులను కూడబెట్టుకుని తెరాస పార్టీని విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కమిషన్ల గురించి, అక్రమార్జన గురించి మాట్లాడే నైతిక అర్హత శోభకు లేదని అన్నారు.

ఎమ్మెల్యేగా గెలిచాక ఒంటెద్దు పోకడలతో వ్యవహరించి కార్యకర్తలను చులకనగా చేసి కమిషన్ల కక్కుర్తి కోసం నియోజకవర్గంలో ప్రతి పనికి పర్సంటేజి తీసుకున్న చరిత్ర శోభదని మండిపడ్డారు. శోభ తీరుపై నియోజకవర్గంలోని నాయకులు ప్రజలు విసిగివేసారి ఈ ఎమ్మెల్యే మాకొద్దు అంటూ సిఎంకు మొరపెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కన్నతల్లిలాంటి అన్నం పెట్టిన పార్టీని విడిచి బిజెపిలో చేరితే మొన్నటి ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా చేసిన విషయాన్ని మరిచిపోవద్దని గుర్తు చేశారు. తెరాస పార్టీకిలోకి రాకముందు ద్విచక్ర వాహనం మాత్రం ఉన్న శోభకు కరీంనగర్, హైదరాబాద్‌లో ఆస్తులు, అంతస్తులు, వ్యవసాయ భూములు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. అవినీతి బాగోతం గురించి నియోజకవర్గ ప్రజలందరికి తెలిసిందేనని మాజీ ఎమ్మెల్యేగా విధానపరమైన విమర్శలు చేయాలి… ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టి ప్రజా ఆమోదం పొందాలే తప్ప అడ్డగోలు విమర్శలు చేస్తు అబాసుపాలు కావొద్దని హితవు పలికారు.

తెరాస కార్యకర్తలకు సభ్యత సంస్కారం ఉందని, తాము నోరు విప్పితే వెయ్యిరెట్లు జవాబు ఇస్తామని స్పష్టం చేశారు. నాడు సీయం కేసిఆర్ దేవుడని, వినోద్ కుమార్ అన్నలాంటి వాడని అన్న శోభ నేడు స్థాయి మరిచి విమర్శలు చేయడం కు సంస్కారానికి నిదర్శనమని అన్నారు. ఇకనైనా బొడిగె శోభ తన తీరు మార్చుకోవాలని లేనట్లయితే నియోజకవర్గ ప్రజలే గుణపాఠం చెప్పె పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు వీర్ల వెంకటేశ్వర్ రావు, గుంజపడుగు హరిప్రసాద్, జక్కుల నాగరాజు, వివిధ మండలాల జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు పర్లపల్లి వేణుగోపాల్, ఎలిగేటి కవిత, మిట్టపల్లి సుదర్శన్, మాచర్ల సౌజన్య, కత్తెరపాక ఉమా, పుల్కం అనురాధ, రాంమోహన్ రావు, మార్కొండ క్రిష్ణారెడ్డి, ఏఎంసి చైర్మన్లు ఎం. తిరుపతి రావు, దూలం బాలా గౌడ్, ఆరెల్లి చంద్రశేఖర్, ద్యావ మధుసూధన్ రెడ్డి, మందారపు అజయ్, జితేందర్ రెడ్డి, రాఘవరెడ్డి, రేణుక, మల్లేశ్వరీ, రాజనర్సింహరావు, క్రిష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News