Thursday, August 7, 2025

బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కిందపురి’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ ఏడాది ‘భైరవం’ సినిమాతో మంచి సక్సెస్‌ని అందుకున్నారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కిష్కిందపురి’ (Kishkindhapuri). అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ గ్లిప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హారర్, సస్పెన్స్ థిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఉండిపోవే నాతోనే ’ అంటూ సాగే తొలి సింగిల్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పాటకు పూర్ణ చారి సాహిత్యం అందించగా.. జావిద్ అలీ ఆలపించారు. రాజు సుందరం కొరియోగ్రాఫీ చేశారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ అవుతోంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News