Saturday, May 4, 2024

లోటస్ పాండ్ చెరువులో చేపలు మృతి

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్‌లో పార్కులోని చెరువులో భారీగా చేపలు మృతి చెందడం కలకలం రేపింది. బుధవారం ఉదయం మరింత పెద్ద సంఖ్యలో చనిపోయిన చేపలు చెరువులో తేలాయి. అయితే గత మూడు రోజులు గా చెరువులో చేపలు చనిపోతునే ఉన్నాయి. అది గమనించిన సెక్యూరిటీ గార్డు ఆ సమాచారాన్ని ప్రభుత్వ అధికారులకు అందించారు. దీంతో జిహెచ్‌ఎంసి లెక్ విభాగం, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులతో ఫిషనరీ విభాగం అధికారులు హూటహుటిన అక్కడికి చేరుకుని చెరువును పరిశీలించారు. అధికారులు చెరువులోని నీటి శాంపుల్స్ సేకరించి పరిక్షించారు. చేపలకు సరిపోను ఆక్సిజన్ అందకపోవడం వల్లే అవి మృత్యు వాత పడుతున్నాయని తెల్చారు.

చెరువులో చేపల సాంద్రత బాగా పెరగడంతో నీటి ఆక్సిజన్ స్థాయి తగ్గి పోయిన కారణంగా చేపలు చనిపోతున్నట్లు ఫిషనరీ విభాగం అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి నివారణ చర్యలు చేపట్టామని , ఇందులో భాగంగా చెరువులో ఆక్సిజన్ స్థాయిని పెంచేందుకు ట్యాబ్లయిడ్స్ అందించడంతో పాటు శానిటైజర్స్ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా చేపల సాంద్రతను తగ్గించేందుకు ప్రతి మూడు నెలలకోసారి వాటిని విభజించనున్నట్లు వెల్లడించారు. చెరువులోని నీరు కాల్యుషం భారిన పడడం కూడా ఆక్సిజన్ స్థాయి తగ్గుతోందని అధికారులు తెలిపారు. ఉదయం వాక్సర్స్‌తో పాటు పరిసర ప్రాంతాల వాసులతో పాటు వ్యాపారులు వ్యర్థాలను చెరువులో వేయడం వల్ల నీరు కలుషితం భారిన పడుతోందని వెల్లడించారు. నివారణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News