Sunday, April 28, 2024

బిజెపి అధ్యక్షుడిపై పరువు నష్టం కేసు

- Advertisement -
- Advertisement -

చెన్నై : డిఎంకె అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌పై అవినీతి ఆరోపణలు చేసిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అన్నామలైపై తమిళనాడు ప్రభుత్వం పరువునష్టం దావా వేసింది. స్థానిక సిటీ సివిల్ కోర్టులో ఈ దావా దాఖలైంది. ముఖ్యమంత్రి స్టాలిన్ తరఫున సిటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేవరాజన్ ఈ కేసు దాఖలు చేశారు. 2011లో డిఎంకె అధికారంలో ఉన్నప్పుడు చెన్నై మెట్రో రైల్ కాంట్రాక్టు విషయంలో రూ.200 కోట్ల చెల్లింపులు జరిగాయని, డిఎంకె ముఖ్య నేతలు అక్రమంగా రూ. 1.34 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించారని, అన్నామలై ఆరోపించారు.

స్టాలిన్ కుటుంబ సభ్యులే దుబాయ్ కంపెనీకి డైరెక్టర్లుగా ఉంటున్నారని, తమిళనాడులో వారే పెట్టుబడులు పెట్టారని అన్నామలై ఆరోపించారు. ఈ నేపథ్యంలో డిఎంకె అధికార ప్రతినిధి టీకేఎస్ ఎలాంగోవన్ …అన్నామలైకు తగిన శిక్ష పడాలంటే ఇదే సరైన చర్య అన్నారు. అన్నామలై క్షమాపణలు చెప్పాలని డిఎంకె ఇదివరకే లీగల్ నోటీసులు పంపింది. మంత్రి ఉదయనిధి స్టాలిన్,దురై మురుగన్,ఈవీ వేలు, సెంథిల్ బాలాజీలతోపాటు పలువురు డిఎంకె నేతలు అన్నామలైకు నోటీసులు పంపారు. అయితే క్షమాపణలు చెప్పడానికి అన్నామలై నిరాకరించారు. దీనిపై చట్టపరమైన చర్యలకు తాను సిద్ధమేనని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News