Friday, April 19, 2024

శ్రీకాంత్ కేసులో ఐదుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖంద్‌గావ్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఆత్మహత్య కేసులో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎసిపి రమేష్ తెలిపారు. శుక్రవారం బోధన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్ 23న కళాశాలకు వెళ్లిన శ్రీకాంత్ తిరిగి ఇంటికి రాలేదని ఎసిపి తెలిపారు. శ్రీకాత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోధన్ రూరల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

శ్రీకాంత్‌కు కళాశాలలో ఓ యువతితో ప్రేమ వ్యవహారం ఉండడంతో ఆమె కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తూ శ్రీకాంత్ కుటుంబసభ్యులు యువతి సమీప బంధువులైన అన్నెం వెంకటేశ్వర్‌రెడ్డి, దేసిరెడ్డి పాపిరెడ్డి, సూర వెంకటేశ్వర రడ్డి, ఎడ్ల శ్రీనివాస్‌రెడ్డి, పల్లె తిరుపతిరెడ్డిపై అనుమానం వ్యక్తంచేశారని తెలిపారు. వీరు శ్రీకాంత్‌ను బెదిరించడం వల్లే శ్రీకాంత్ పట్టణ శివారులోని పసుపు వాగువద్ద బెల్టుతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎసిపి వెల్లడించారు. కేసు విచారణలో ఉండగానే శ్రీకాంత్ అస్తిపంజరం గత ఏడాది డిసెంబర్ 12న పసుపువాగు వద్ద లభించిందని తెలిపారు. ఈ సమావేశంలో బోధన్ పట్టణ సిఐ ప్రేంకుమార్, రాజశేఖర్, శ్రీధర్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News