Friday, May 10, 2024

సాకర్ మ్యాచ్‌లో ఐదుగురు సబ్‌స్టిట్యూట్‌లు

- Advertisement -
- Advertisement -

 

లండన్: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో కొత్త నిబంధన అమలు కానుంది. ఇకపై సాకర్ క్రీడలో సబ్‌స్టిట్యూట్‌ల సంఖ్య పెరగనుంది. ఇప్పటికైతే ఇది తాత్కాలికమే అయినా ఇకపై ఐదుగురు ఆటగాళ్లు సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగేందుకు అవకాశం త్వరలోనే రానుంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రారంభమయ్యే ఫుట్‌బాల్ టోర్నీల నిబంధనల్లో ఈ కీలక మార్పుకు చోటు కల్పించనున్నారు.

ఆటగాళ్లను గాయల నుంచి రక్షించాలనే ప్రధాన ఉద్దేశంతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ఈ నిబంధనను అమలు చేయనుంది. ఈ నిబంధన ప్రకారం ఇకపై ఐదుగురు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు బరిలోకి దిగేందుకు అవకాశం ఏర్పడనుంది. కాగా, దీనికి ఈ వారంలోనే ఆమోదముద్ర వేసి అమల్లోకి తెచ్చేందుకు ఫుట్‌బాల్ సమాఖ్య చర్యలు ప్రారంభించింది. ఇదిలావుండగా ఈ నిబంధనను తాత్కాలికంగానే అమలు చేయనున్నారు. దీర్ఘకాలంలో ఇది ఉండే అవకాశాలు అంతంత మాత్రమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News