Saturday, May 4, 2024

వైవిధ్యమైన లుక్ – బాడీ లాంగ్వేజ్‌తో

- Advertisement -
- Advertisement -

 

‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ తన తదుపరి చిత్రాలన్నీ భారీ లెవెల్ లోనే రూపొందించి వరల్ వైడ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి, – సాహో లాంటి భారీ వసూళ్లు రాబట్టిన సినిమాల తర్వాత ఈ స్టార్ హీరో ప్రస్తుతం పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్నారు. జిల్ సినిమా ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారట. ఇక డార్లింగ్, – మిర్చి,- సాహో సినిమాలతో ప్రభాస్‌కి విపరీతంగా లేడీ ఫాలోయింగ్ పెరిగింది. ఇక తాజాగా రూపొందుతున్న సినిమాలో ఈ స్టార్ హీరో కొత్త లుక్‌లో కనిపిస్తారని తెలిసింది.

అప్పటి పీరియాడిక్ టైంలో ఉండే లుక్స్, నేటి ఆధునిక స్టైల్‌తో ఆయన కనిపిస్తారని సమాచారం. 1960లోని గాఢమైన ప్రేమకథ కాబట్టి ఆ ట్రెండ్‌కి ఆధునిక ట్రెండ్‌కి తగ్గ లుక్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారట ఫిల్మ్‌మేకర్స్. ఇంతవరకు కనిపించని వైవిధ్యమైన లుక్, – బాడీ లాంగ్వేజ్‌తో ప్రభాస్ దర్శనమిస్తారట. యువి క్రియేషన్స్, గోపికృష్ణ ప్రొడక్షన్స్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, – తమిళ్, ఇతర భాషలలో రిలీజ్ కానుంది. ఇక గతంలో జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను చిత్ర దర్శకుడు రాధాకృష్ణ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News