Wednesday, September 18, 2024

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పోటాపోటీ

- Advertisement -
- Advertisement -
Flipkart Big Billion Days sale dates changed
‘బిగ్ బిలియన్ డేస్’ విక్రయ తేదీల్లో మార్పు

న్యూఢిల్లీ : దేశీయ ఈ- కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మధ్య పోటీ మరింత వేడెక్కింది. పండగ సీజన్ సందర్భంగా ప్రకటించిన ‘ది బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ను వచ్చేనెల 3-10 తేదీలకు మారుస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ శనివారం ప్రకటించింది. తొలుత కంపెనీ ఈ సేల్‌ను వచ్చేనెల 7-10 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అయితే, అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్‌ను అక్టోబరు 4న ప్రారంభిస్తున్నట్లు తొలుత ప్రకటించింది. తాజాగా దానిని 3వ తేదీకి మార్చుకుంది. దాంతో ఫ్లిప్‌కార్ట్ తన సేల్ తేదీని అమెజాన్ కంటే ఒక రోజు ముందుకు జరిపినట్లు సమాచారం. ప్రైమ్ కస్టమర్లు మరింత ముందుగానే ఆఫర్లు పొందవచ్చునని ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌నకు చెందిన ఆన్‌లైన్ ఫ్యాషన్ పోర్టల్ మింత్రా డాట్‌కామ్ సైతం వచ్చే నెల 3-10 తేదీల్లో ‘బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్’ సేల్‌ను నిర్వహించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News