Thursday, September 25, 2025

బాసరలో ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ

- Advertisement -
- Advertisement -

ఎగువన మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లా, బాసర వద్ద గోదావరి నదికి వరద ఉద్ధృతి క్రమ క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలోని నాందేడ్, పర్బని జిల్లాల్లో భారీ వర్షాలు ఏకధాటిగా కురుస్తుండడంతో ఇక్కడి గోదావరి నదీ తీరం వద్ద పుణ్యస్నానాలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. నదిలోకి వెళ్లకుండా ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. గోదావరి బ్యాక్ వాటర్‌తో ఆలయం నుండి గోదావరి నదికి వెళ్లే మార్గంలో వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు గోదావరి నది వ్దద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పవనచంద్ర, ఎస్‌ఐ శ్రీనివాస్ కోరారు. గోదావరి నది ప్రవాహాన్ని సంబంధిత అధికారులు పరిశీలించి అధికారులు ప్రజలు నదిలోపలికి చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు.

బాసరకు నిలిచిపోయిన రాకపోకలు
బాసర మండల కేంద్రం నుండి ఓని గ్రామానికి వెళ్ల్లే రహదారి బ్రిడ్జి గోదావరి బ్యాక్ వాటర్‌లో బుధవారం నీటితో మునిగింది. దీంతో మండలంలోని ఓని, కౌట, సాలాపూర్, గ్రామాల ప్రజలు కిర్గుల్ (కె) మీదుగా ముథోల్ మీదుగా ప్రయాణించాలని ఎస్‌ఐ శ్రీనివాస్, తహసీల్దార్ పవన చంద్ర సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు సైతం నీట మునిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News