Sunday, April 28, 2024

ఒక జిల్లా, ఒక ఉత్పత్తి

- Advertisement -
- Advertisement -

FM Nirmala Sitharaman exhorts banks

ఈ ఎజెండా కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేయాలి
ఎగుమతి పరిశ్రమపై దృష్టి పెట్టండి
సైన్‌రైజ్ సెక్టార్‌కు సహాయం అవసరం
బ్యాంక్‌లకు సూచించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

ముంబై : అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని, ‘ఒక జిల్లా, ఒక ఉత్పత్తి’ని ప్రోత్సహించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు సూచించారు. అదే సమయంలో ఎగుమతి పరిశ్రమపై బ్యాంకులు ఎక్కు వ దృష్టి పెట్టాలని అన్నారు. దీంతో పాటు ఎస్‌ఐడిబిఐ, ఎగ్జిమ్ బ్యాంక్‌లు మౌలిక సదుపాయాల ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేయాలని అన్నారు. ఈ రెండు బ్యాంకులు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎగుమతుల కోసం పనిచేస్తా యి. బుధవారం ముంబైలో ఆదాయపు పన్ను, జిఎస్‌టి, కస్టమ్స్ అధికారులతో పాటు ప్రభుత్వరంగ బ్యాంకుల అధినేతలతో మంత్రి చర్చలు నిర్వహించారు. స్వావలంబ న భారతదేశానికి సంబంధించి ఏ ప్రకటనలు చేసినా, వాటిని సమీక్షిస్తామని ఆమె అన్నారు. ఎగుమతిదారుల సమస్యలను పరిష్కరించాలని బ్యాంకులకు సూచించారు.

ప్రభుత్వరంగ బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. పరిశ్రమకు ఇప్పుడు బ్యాంకులే కాకుండా ఇత ర మార్గాల ద్వారా డబ్బును సేకరించే అవకాశం ఉంది. బ్యాంకులు కూడా మార్కెట్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలి. ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకాన్ని ప్రోత్సహించాలని ఆమె కోరారు. కరోనాకు ముందు చిన్న బ్యాంకులు పెద్ద బ్యాంకులతో విలీనం అయ్యాయి. దీని వల్ల వినియోగదారులు ఎలాంటి సమస్యను ఎదుర్కోలేద ని, విలీనాలకు సంబంధించిన అన్ని పనులను బ్యాంకు లు సమర్థవంతంగా నిర్వహించాయని అన్నారు. కరోనా సమయంలో కస్టమ్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఎలాంటి విశ్రాంతి లేకుండా పని చేశారని ఆమె అన్నారు. జిఎస్‌టి అధికారులు కూడా బాగా పనిచేశారు. ప్రతి నెలా జిఎస్‌టి సగటు వసూళ్లు రూ.లక్ష కోట్లుగా ఉన్నాయి. దవ్యోల్బ ణం రేటును 6 శాతం దిగువ ఉంచగలిగామని ఆర్థిక కార్య దర్శి దేబాషిష్ పాండా అన్నారు.

గత ఆర్థిక సంవత్సరం లో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.30,000 కోట్లకు పైగా లాభాలను ఆర్జించాయి. అన్ని ప్రభుత్వ బ్యాంకులు పిసిఎ (తక్షణ దిద్దుబాటు చర్య) ఆంక్షల నుండి బయటకు వచ్చా యి. బ్యాంకులు కొన్ని పరిమితులను పాటించని పక్షంలో ఆర్‌బిఐ వాటిని పిసిఎ పరిధిలోకి తీసుకుంటుంది. పిసిఎ పరిధిలోకి వెళ్లిన తర్వాత బ్యాంకులు కొత్త బ్రాంచ్‌లు తెరవలేవు, అలాగే కొత్త రుణాలు ఇవ్వడం కూడా కుదరదు. సన్‌రైజ్ సెక్టార్‌కు బ్యాంకింగ్ సహాయం అవసరమని ఆర్థికమంత్రి అన్నారు. బ్యాంకులు వాటిని గుర్తించి తగిన సహాయం అందివ్వాలని ఆమె సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు వరుసగా ఐదు సంవత్సరాలు నష్టాల్లో నడిచాయని, కానీ 2021 మార్చి ముగింపు ఆర్థిక సంవత్సరంలో రూ.31,817 కోట్ల లాభాన్ని సంపాదించాయి. ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) 2021 మార్చిలో రూ.6.16 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది ఒక సంవత్సరంలో రూ.62 వేల కోట్లు తగ్గింది. బ్యాంకుల్లో మోసం సంఘటనల సంఖ్య 2020-21లో 2,903కి తగ్గింది.

బ్యాంక్ ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ పెంపు

పెన్షన్ విషయంలో ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ చివరి జీతం ఆధారంగా 30 శాతం పెరుగనుంది. ఇకపై బ్యాంకు ఉద్యోగులు రూ.30 నుంచి 35 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. గతంలో ఇది రూ.9,284 గా ఉంది. ఈ సమాచారాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి దేబాషిష్ పాండా తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, బ్యాంకు ఉద్యోగులకు పెన్షన్ చెల్లింపును పెంచాలని నిర్ణయించిందని అన్నారు. దీని కింద ఎన్‌పిఎస్ కింద ఉద్యోగుల పెన్షన్‌కు ప్రభుత్వ బ్యాంకుల సహకారం 14 శాతానికి పెరిగింది. గతంలో ఇది 10 శాతం ఉండేది. దీంతో కరోనా సమయంలో మరణించిన ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగుల కుటుంబాలకు అందుతున్న పెన్షన్ 30 శాతం పెరిగింది.

బీమాలో ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది

వ్యూహాత్మక ప్రధాన రంగాల్లో కేంద్ర ప్రభుత్వం నియంత్రణ ఉంటుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పునరుద్ఘాటించారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా వంటివి వ్యూహాత్మక రంగాలుగా గుర్తించామని, ఈ రంగాల నుంచి ప్రభుత్వం పూర్తిగా నిష్క్రమించబోదని, కానీ కనీస నియంత్రణ ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News