Friday, May 3, 2024

‘బంగార్రాజు’ షూటింగ్ షురూ

- Advertisement -
- Advertisement -

Bangarraju shooting started

 

కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం నాగార్జున కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ చిత్రం రాబోతోంది. ఇందులో నాగ్ తో పాటుగా పెద్ద కుమారుడు నాగ చైతన్య కూడా కనిపించనున్నారు. ఇటీవలే ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం నుండి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈసారి తండ్రి-కొడుకు ద్వయం తమదైన శైలిలో అలరించడానికి వస్తున్నారని చెప్పడానికి సింబాలిక్ గా రెండు బైక్స్‌ని ఈ పోస్టర్‌లో చూపించారు. ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణ.. చైతన్యకు జోడీగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లపై నాగార్జున అక్కినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News